స్టార్ హీరో నుంచి నిర్మాతకు బెదిరింపులు. అసలు ఏమైందంటే..!

తాజాగా ఒక నిర్మాత బడా స్టార్ హీరో పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ స్టార్ హీరో కూడా నిర్మాత అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారట.. నిజం చెప్పాలంటే ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొంతమంది తెరపై మాత్రమే కాదు తెర వెనుక కూడా హీరోగా ప్రవర్తిస్తుంటారు. మరి కొంతమంది మాత్రం తమ వ్యక్తిత్వానికి తగినట్టుగా దూకుడుగా వెళుతూ ఉంటారు
ఇక అది మంచో చెడో తెలియక వాళ్ళను మార్చడం ఎవరి తరం కాదు అని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ఒక నిర్మాత సదరు స్టార్ హీరో తనను బెదిరిస్తున్నాడు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే సినీ నిర్మాతను బెదిరించిన కేసులో కన్నడ సూపర్ స్టార్ హీరో దర్శన్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా రెండేళ్ల క్రితం దర్శన్ సమీప బంధువు ధృవన్ తో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ సినిమా కోసం సంతకం చేసానని సదరు నిర్మాత భరత్ బెంగళూరులోని కెంగేరి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కానీ నిర్మాత భరత్ ఆర్థిక నష్టాల కారణంగా సినిమా షూటింగ్ ఆపివేయడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తన సహ నిర్మాత ధృవన్ తో కూడా చెప్పారు.అప్పుడు ధృవన్ హీరో దర్శన్ ను కాన్ఫరెన్స్ కాల్ లోకి తీసుకొని ముగ్గురు చర్చించడం జరిగింది. కానీ దర్శన్ ఊహించని విధంగా సదరు నిర్మాతతో నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉండడం.. అంతే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదన్నట్టు దర్శన్ మాట్లాడినట్లు ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ విషయంపై నిర్మాత పోలీస్ స్టేషన్లో దర్శన్ పై కంప్లైంట్ ఇవ్వగా స్థానిక పోలీసులు.. శ్రీకృష్ణ పరమాత్మ దర్శకుడు ఆంటోనీ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. మరి ఈ విషయంపై ఎంతవరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest