సౌందర్య మరణించే ముందు మాట్లాడిన చివరి మాటలు ఇవే..!

సౌందర్య.. పేరుకే కన్నడ ముద్దుగుమ్మ.. కానీ తెలుగు ఇంటి ఆడపడుచులా చక్కటి అందంతో సాంప్రదాయ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించిన ఏకైక అంధాలతార అని చెప్పవచ్చు . ఇక అందం , అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవి తర్వాత అంత రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే చేయాలనే ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో కూడా అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ గా ఎరిగింది సౌందర్య. ఇక అందుకే అప్పట్లో అందానికే కాదు సాంప్రదాయానికి కూడా కేరాఫ్ అడ్రస్ గా మిగిలింది. ఇక ఇలా ఎన్నో పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్యానే చెప్పవచ్చు.12 yrs after death, Soundarya wins case

సుమారుగా 12 సంవత్సరాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగు వెలిగిన ఈమె 120 చిత్రాలకు పైగా నటించి స్టార్ హీరోలు అందరితో కూడా జతకట్టింది. ఇక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఒక విమాన ప్రమాదంలో సౌందర్య మరణించింది. ఇక దీనితో అభిమానులు అందరూ కూడా తీవ్ర దిగ్బ్రాంతి లో మునిగిపోయారు. ఇక స్టార్ హీరోయిన్గా ఉన్న సౌందర్య బిజెపి క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించి ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక 2004లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిహెచ్ విద్యాసాగర్ రావు మద్దతుగా ప్రచారం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇక ఇందుకోసం సౌందర్య ,తన తమ్ముడు అమర్నాథ్, తన ఫ్రెండ్ రమేష్ తో కలిసి బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కరీంనగర్ బయలుదేరారు.

అలా బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి హెలికాప్టర్ సాంకేతిక కారణాలవల్ల కూలిపోయింది .అయితే ప్రమాదానికి ముందు ప్రచారంలో ఆమె మంచి స్పీచ్ ఇవ్వాలని మాట్లాడారట. సాంకేతిక సమస్య ఏర్పడడంతో ఎలాగైనా హెలికాప్టర్ ను బాగు చేయాలని సౌందర్య ఫైలెట్ ను అడిగిందం.ట బాగు చేయడం కుదరదు అని చెప్పడంతో బిగ్గరగా కాపాడండి అంటూ అరిచిందట. అయితే సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి ఎగసిపడుతున్న మంటలకు నిమిషాల వ్యవధిలోని సౌందర్య తో సహా అందరూ మాడి మసైపోయారు.

Share post:

Latest