క్రికెట్ అభిమానులకు పండగే… మరోసారి దాయాదుల పోరు తప్పదా..!

ఇటీవల కాలంలో భారత్, పాక్ ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం చాలా అరుదుగా చూసాం. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్ లో మినహా ఈ రెండు దేశ జట్లు ఎదురుపడింది లేదు. సంవత్సరానికో లేక రెండు సంవత్సరాలకో లేదా నాలుగు సంవత్సరాలకో ఒకసారి జరిగే ఈ మ్యాచ్‌లు కోసం రెండు దేశాల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తారు. తాజాగా అలాంటిది ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య 15 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఎదురుపడే అవకాశం వచ్చింది. ఇరుదేశాల క్రికెట్ అభిమానులకు ఆనందానికి అవధులు లేవు? ఆసియా కప్ 2022 పుణ్యమా ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లు కళ నెరవేరేలా ఉంది.

ASIA CUP 2022 Schedule, Team, Venue, Time Table, PDF, Point Table, Ranking & Winning Predictionఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న భారత్- పాక్ లు మొదటిసారిగా గ్రూప్ A లో తల పడనున్నాయి. ఈ రెండు దేశాలే కాకుండా మిగిలిన దేశాలు జ‌ట్లు కూడా ఉన్నాయి. ఈ గ్రూపులో ఉన్న దేశాల జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచే జ‌ట్లు సెప్టెంబర్ 4న సూపర్ 4లో తలపడతాయి. ఉన్న జ‌ట్లు కంటే భారత్-పాక్ లు బలమైన జట్లు. ఈ రెండు జ‌ట్లు సూప‌ర్ 4లో మరోసారి తలబడటం ఖాయమని. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సమీకరణాలు మారే అవకాశం లేదు అంటున్నారు క్రికెట్ అభిమానులు . ఇదే క్రమంలో గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్ల‌ ఉన్నాయి. వీటిలో రెండు జట్లు మాత్రమే సూపర్ 4 చేరే అవకాశం ఉంటుంది. సూపర్4 కు చేరుకునే క్రమంలో అక్కడ ఆడే ప్రతి జట్టు తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం భారత్- పాక్ లు మంచి ఫామ్ లో ఉన్నాయి. దీని బట్టి చూస్తే ఫైనల్ కి వెళ్లే అవకాశాలకు ఈ రెండు జట్లులకు ఎక్కువ ఉన్నాయి.ఇదే జరిగితే ఫైనల్ లో మరోసారి దాయాదుల పోరు తప్పదు. సెప్టెంబర్ 11న జరిగే ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత్- పాక్ లు మరోసారి తలపడనున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే 15 రోజుల వ్యవధిలోనే ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానులకు పండగే పండుగ. భారత్ -పాక్ లు చివరి సారీగా గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో త తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ పాక్ చేతిలో చాలా దారుణంగా 10 వికెట్ల తేడాతో ఘోరమైన పరాజయం చూసింది. 1992 తర్వాత ప్రపంచ కప్ లో భారత్ పై పాకిస్తాన్ కు ఇది తొలి విజయం.