సీనియర్ నటి నిర్మలమ్మ పెళ్లి వెనుక ఇన్ని షరతులా..తెలిస్తే షాక్.!!

ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లను మొదలుకొని.. తర్వాత తరం హీరోలైన చిరంజీవి, రాజేంద్రప్రసాద్ , బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి, బామ్మ, అత్త పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మొదటగా పౌరాణిక కథ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ 800 చిత్రాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి.. రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈమె అసలు పేరు రాజమణి.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో గంగమ్మ – కోటయ్య దంపతులకు గౌడ కుటుంబంలో 1925లో జన్మించింది. నాటకాలలో మక్కువ పెంచుకున్న నిర్మలమ్మ 10 సంవత్సరాల వయసులోనే నాటక రంగంలోకి అడుగు పెట్టింది.Nirmalamma Wiki Bio Age Husband Salary Photos Video News Ig Fb Tw

ఇక ఈమె పెళ్లి విషయానికి వస్తే.. చాలా విచిత్రంగా జరిగిందని చెప్పాలి. ఎన్నో షరతుల మధ్య వివాహం చేసుకున్నారు నిర్మలమ్మ. ఒకసారి రంగస్థలం నటుడిగా నాటక ప్రదర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న జీ.వీ. కృష్ణ రావు.. రాజమణిని చూసి ప్రేమలో పడ్డారట. ఇక ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవడానికి.. పెళ్లి చూపులకు ఆమె ఇంటికి వెళితే ఆమె జీ.వి.కృష్ణారావుకి కొన్ని షరతులు కూడా విధించిందట. ఇక ఆ షరతులు ఏమిటి అంటే వివాహం తర్వాత నాటకాలను నటించకూడదని కండిషన్ తనకు పెట్టకూడదని చెప్పిందట. ఇక నిర్మలమ్మ పెట్టిన కండిషన్ మేరకు రెండు కుటుంబాల పెద్దలు నిర్ఘాంతపోయారు.Nirmalamma Wiki Bio Age Husband Salary Photos Video News Ig Fb Twఇక ఎవరు ఎన్ని చెప్పినా ఆమె వినకపోయేసరికి చివరికి జీవీ కృష్ణారావు ఆమె పెట్టిన షరతు ను ఒప్పుకొని వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత వీరిద్దరూ స్వయంగా నాటక సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ మేనేజర్ గా పలు చిత్రాలకు పని చేస్తూ.. చిత్ర నిర్మాణ రంగంలో అందరి ప్రశంశలు సొంతం చేసుకున్నారు ఈ జంట. ఇకపోతే వీరికి పిల్లలు లేని కారణంగా కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకోవడం జరిగింది.

Share post:

Latest