బింబిసార-2 సినిమాలో లేడీ విలన్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సార చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా కూడా వసూళ్లను రాబట్టి.. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే విడుదలకు ముందే క్లారిటీ ఇచ్చింది.. తప్పకుండా సీక్వెల్ కూడా అంతకుమించి అనేలా తెరకెక్కించబోతున్నట్లు డైరెక్టర్ వశిష్ట కూడా తెలియజేశారు. ఇక ఇప్పుడు బింబి సార -2 ఏ స్థాయిలో ఉంటుందో అని అభిమానులు సైతం ఆసక్తిగా ఉంటున్నారు.ఈసారి లేడీ విలన్ తో బింబిసార ఫైట్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటేఈ క్రమంలోనే ఈ సినిమా పైన పలు రూమర్లు కూడా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అలాగే సెకండ్ పార్ట్ లో ఒక అగ్ర హీరోయిన్ కూడా ఈ చిత్రంలో నటించబోతోంది అన్నట్టుగా కథలు వినిపించాయి.. ముఖ్యంగా బింబిసార సినిమాలో ఒక పవర్ఫుల్ రాకాసి పాత్రలో ఒక హీరోయిన్ నటించబోతోంది అని టాక్ వినిపించింది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లను సైతం ఈ సినిమాలో నటించేందుకు నెగటివ్ పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో అనే విషయాన్ని డైరెక్టర్ ని సంప్రదించగా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు వశిష్ట.Bimbisara 24 Days Collections: బింబిసారకు కలిసొచ్చిన సండే.. ఆ రికార్డు  కొట్టిన కల్యాణ్ రామ్ | Kalyan Ram Bimbisara Movie 24 Days Box Office  Collections - Telugu Filmibeatవశిష్ట మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఎలాంటి హీరోయిన్ ని తీసుకోలేదు అని ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేశారు.. ప్రస్తుతం బింబిసారా సినిమా సక్సెస్ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలియజేశారు డైరెక్టర్ వశిష్ట. ఇంకా ఈ సినిమా పార్ట్ -2 కు సంబంధించి ఎలాంటి కథలు కూడా సిద్ధం చేయలేదని అందుకోసం కాస్త సమయం పడుతుందని.. ఈ సినిమా పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధమయ్యాకే అన్ని విషయాలను తెలియజేస్తానని క్లారిటీ ఇచ్చారు వశిష్ట. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి వార్త వచ్చినా అది నిజం ఉండదని కేవలం ఎలాంటి విషయాన్ని నైనా అధికారికంగా తెలియజేస్తామని వశిష్ట.

Share post:

Latest