కేరవ్యాన్ లో అది ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టేసిన నిహారిక..

నిహారిక కొణిదెల.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెర నటిగా, హోస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది.. అయితే వెండితెరపై ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు..వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తోంది..2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లి చేసుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారిక ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ ని డిలీట్ చేసింది.. నిహారిక పోస్ట్ చేసిన జిమ్ వీడియోపై ట్రోలింగ్స్ రావడంతో ఆమె ఇన్ స్టా నుంచి వైదొలిగింది..

ఇలా సడెన్ గా ఇన్ స్టా అకౌంట్ ని డిలీట్ చేయడంతో ఆమెపై ఎన్నో రూమర్లు వచ్చాయి.. తన భర్త చైతన్యతో విభేదాలు వచ్చాయని, దీంతో నిహారిక డిప్రెషన్ లోకి వెళ్లిందని, అందుకే ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిందని వార్తలు వచ్చాయి.. అదే సమయంలో హైదరాబాద్ పబ్ లో నిహారిక పట్టుబడటం హాట్ టాపిక్ అయ్యింది. ఈక్రమంలో నిహారిక సైలెంట్ గా ఉంటూ వచ్చింది. అయితే ఆమె భర్త చైతన్య, నిహారిక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ రూమర్లకు బ్రేక్ పడింది.. నిహారిక కూడా ఇన్ స్టాలో రీ ఎంట్రీ ఇచ్చింది.. జోర్డాన్ ట్రిప్ లో భర్తతో దిగిన ఫొటోలు షేర్ చేసింది.

తాజాగా నిహారిక హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రాజెక్టులో నిహారిక ప్రస్తుతం బిజీగా ఉంది. అయితే నిహారిక షూటింగ్‌ కి వెళ్లినప్పుడు ఆమె వెంట తప్పనిసరిగా ఓ కేర్యవాన్ ఉంటుంది. ఈ కేరవ్యాన్ గురించి నిహారిక పలు విషయాలు పంచుకుంది.. తన కేరవ్యాన్ లో తప్పనిసరిగా ఇవి ఉండాల్సిందే అని చెప్పింది. తన భర్త, తన పెట్ బజ్, తాను కలిసి దిగిన ఫోటో తప్పనిసరిగా కేరవ్యాన్ లో ఉండాలని చెప్పింది. పెళ్లయిన తర్వాత నిహారికకు చైతన్య ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఈ పెట్ బజ్.. ఈ బజ్ అంటే నిహారికతో పాటు నాగబాబుకు కూడా చాలా ఇష్టమట.

Share post:

Latest