ఆ పాపం రాఘవేంద్రరావుదే.. తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుమ..!!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తన దర్శకత్వంలో ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను స్టార్ పొజిషన్ కి చేర్చారు అనడంలో సందేహం లేదు. రమ్యకృష్ణ మొదలుకొని నేటితరం యంగ్ హీరోయిన్ శ్రీలీల వరకు ప్రతి ఒక్కరు కూడా రాఘవేంద్ర దర్శకత్వంలో నటించిన తర్వాతనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే తాజాగా ప్రముఖ బుల్లితెర స్టార్ యాంకర్ సుమ రాజీవ్ తో తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. ఆ పాపం మీదే సార్ అంటూ రాఘవేంద్రరావు ఉద్దేశించి మాట్లాడింది. ఇక ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..Suma - Raghavendra Rao: నువ్వు చేసేదంతా మోసమే.. యాంకర్ సుమపై కేసు  పెడతానంటున్న రాఘవేంద్రరావు.. | Tollywood director Raghavendra Rao wants to  file case against anchor Suma Kanakala and here the reason pk– News18 Telugu

అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో సుడిగాలి సుదీర్ హీరోగా , యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్గా అనసూయ కలిసి నటించిన తాజా చిత్రం వాంటెడ్ పండుగాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్న చిత్రం యూనిట్.. తాజాగా సుమ హోస్టుగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. సుమ.. విష్ణు ప్రియ, అనసూయ , నిత్యాశెట్టి , యశ్వంత్ మాస్టర్, రాఘవేంద్ర రావు ఈ షో లో సందడి చేసారాని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరందరూ కూడా క్యాష్ ప్రోగ్రామ్ కి కొత్త అందాన్ని తీసుకొచ్చారు.అనసూయ చేతిలో చెయ్యేసి కాలేజ్‌ నాటి ప్రేమకథలు పంచుకున్న దర్శకేంద్రుడు.. పది  కోట్లకి జబర్దస్త్ యాంకర్‌

ఇక క్యాష్ ప్రోగ్రాంలో భాగంగా రాఘవేందర్రావు అనసూయ చేతిలో చేయి వేసుకొని క్యాష్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రాఘవేంద్రరావు బొకేని విసరగా విష్ణు ప్రియ హమ్మయ్య పెళ్లయింది నాకు అని చెబుతారు. ఇలా వేస్తే పెళ్లవుతుందా అని సుమ మరో బొకే విసరగా ఎస్ ఎస్ రెండు పెళ్లిళ్లు అంటూ విష్ణు ప్రియ వెరైటీ ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. ఇక రాఘవేంద్రరావు నేను అనసూయ ఒకరి చేతిలో మరొకరం చెయ్యి వేసుకుని ఎందుకు వచ్చి ఉంటామని అడగగా..సుమా అక్కడ మెట్లు ఉంటాయి.. ఆవిడ ఎక్కలేరు కాబట్టి మీరు ఆవిడని పట్టుకొచ్చారని పంచ్ వేస్తుంది

ఇక కాలేజీలో అనసూయ అనే అమ్మాయి ఉండేదని.. ఇప్పుడు మళ్లీ ఈ అనసూయ దొరికిందని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామని ఇలా వచ్చాము అంటూ రాఘవేంద్రరావు తెలిపారు. అప్పుడు లక్కీగా మీ లైఫ్ లో సుమా అనే అమ్మాయి రాలేదు సార్ అని రాఘవేంద్రరావు చెప్పగా సుమా లేని లైఫ్ ఉందా అసలు అంటూ కామెంట్ చేశారు. ఇక నా వల్లే కదా నీకు పెళ్లయింది అని రాఘవేందర్రావు చెప్పగా.. రాజీవ్ తో పెళ్లి ఆ పాపం మీదే సార్ అని సుమ కామెంట్ చేసింది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest