మహేష్-పూరి మధ్య విభేదాలు రావడానికి కారణం అదే..!!

గడిచిన రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అభిమానులు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు . ఇక సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోయినా కూడా అభిమానులు సైతం నిరాశ చెందకుండా పోకిరి సినిమాను స్పెషల్ షో థియేటర్లలో ప్రదర్శించడంతో చాలా సందడిగా చేశారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పోకిరి సినిమా చాలా స్పెషల్ గా అనిపించింది. దాదాపుగా 500 థియేటర్ లలో షోలు నిర్వహించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి ఘనత అందలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.Puri Has A Logic And Mahesh Fans Have One!

అయితే పోకిరి సినిమా చుట్టూ ఇంత హంగామా జరుగుతున్నా.. పోకిరి సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం ఈ సినిమా పైన ఎలాంటి కామెంట్లు చేయలేదు.. అయితే కనీసం మహేష్ బాబు పుట్టినరోజున ఒక ట్విట్టర్ కూడా చేయకపోవడంతో ఇప్పుడు ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే గతంలో మహేష్ బాబుతో ఉన్న పలు విభేదాల వల్ల పూరి జగన్నాథ్ ఈ వేడుకలను అసలు పట్టించుకోలేదని అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక టాలీవుడ్లో మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కాంబినేషన్ మంచి సక్సెస్ అని చెప్పవచ్చు వీరిద్దరూ కలిసి గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ రెండు సినిమాలు తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డులను సైతం తిరగరాసాయి.Tollywood: Puri Jagannadh in a fix!అయితే మహేష్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన అనే సినిమాని అనౌన్స్మెంట్ చేశారు కానీ ఈ సినిమా పైన ఏ ఒక్కరు అధికారికంగా ప్రకటించలేదు.. దీంతో దర్శక హీరోల మధ్య దూరం పెరిగిపోయిందని సమాచారం. అయినా కూడా వీరిద్దరి కాంబినేషన్లు సినిమా చూడడానికి అభిమానుల సైతం చాలా ఆసక్తిగా ఉంటున్నారు. అయితే పూరి జగన్నాథ్ గతంలో మహేష్ సక్సెస్ లో ఉంటేనే డైరెక్టర్లకు సినిమా అవకాశాలు ఇస్తాడని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక అందుచేతనే మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదని అభిమానులు భావిస్తున్నారు.

Share post:

Latest