డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయిన తరుణ్ హీరోయిన్..కారణం.?

సినీ కెరియర్ లో ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకొని ఇలా నిలబడగలిగినప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది ఒకటి రెండు సినిమాలలో నటించినా.. చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. అలాంటి వారిలో తరుణ్ తో నువ్వే కావాలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన రీచా మల్లాడ్ కూడా ఒకరు. నువ్వే కావాలి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఈమె ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతం ఏం చేస్తోంది? ఎక్కడుంది? అనే విషయాలు తెలియక ఆమె అభిమానులు కూడా ఆమె కోసం తెలుసుకోవడానికి తన ఆసక్తి చూపిస్తున్నారు.Tarun's All Time Blockbuster Nuvve Kavali completes 20 years

1980 ఆగస్టు 30వ తేదీన రీచా మల్లాడ్ జన్మించింది. సినిమాల మీద ఆసక్తితోనే తన అడుగులను ఇండస్ట్రీ వైపు వేసి హిందీ, తెలుగు ,కన్నడ , మలయాళం తదితర భాషలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత 200కు పైగా యాడ్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. నువ్వే కావాలి సినిమా తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం గమనార్హం. 2011లో హిమనుష్ బజాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా 2013లో వీరికి ఒక కుమారుడు జన్మించాడు.Nuvve kaavali heroine Richa whereabouts details, heroine richa, richa mallad,  nevve kavali heroine, nevve kavali movie , tharun, malupu movie , richa  mallad movie, richa mallad family, himanshu bajaj, tollywood - Telugu

2016లో మలుపు అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన ప్రేక్షకులకు పెద్దగా రీచ్ అవ్వలేదని చెప్పాలి. ఇక అలా దూరమైన ఈ ముద్దుగుమ్మ 41 సంవత్సరాలు వయసులో కూడా హీరోయిన్గా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయింది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ రాణిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లోనే స్థిరపడినట్లు తెలుస్తోంది ఇకపోతే ఈమె నటించింది తెలుగులో కేవలం రెండు సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే రీఛా మల్లాడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఉండడంతో అభిమానులు కూడా ఒకింత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest