ఆస్తుల కోసం తల్లిదండ్రులపైనే కేసు వేసిన స్టార్ హీరోయిన్స్..!!

కుటుంబం అన్నాక సమస్యలు రావడం సహజం.. కానీ ఆ సమస్యలను బయట ప్రపంచానికి తెలియకుండా కుటుంబంలోని వ్యక్తులతోనే పరిష్కరించుకుంటే సమస్య తొలగిపోతుంది.. అలా కాదని బయట చర్చించుకోవడమే కాదు కోర్ట్ , పోలీస్ స్టేషన్లో అంటూ తిరిగితే ఉన్న పరువు కాస్త పోతుందని చెప్పవచ్చు. సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే సెలబ్రిటీల కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే హీరోయిన్లు కూడా తమ కన్న తల్లిదండ్రుల పైన ఆస్తుల కోసం కేసు పెట్టారు. ఇక వారి గురించి మనం ఒకసారి చదువుకుందాం..

1. వనిత విజయ్ కుమార్:Vanitha Vijayakumar announces her TV debut with Chandralekha; see video -  Times of Indiaముఖ్యంగా ఆస్తుల కోసం తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన స్టార్ హీరోయిన్లు అనగానే ముందుగా వనిత విజయ్ కుమార్ పేరు వినిపిస్తుంది. ఇక ఈమె తల్లి ఉన్నంతసేపు బాగా బ్రతికింది కానీ తల్లి చనిపోవడంతో తన తండ్రి విజయ్ కుమార్ ఈమెకు ఒక్క రూపాయి కూడా ఆస్తి ఇవ్వకపోగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు . దీంతో చెలరేగిపోయిన వనిత ఆస్తి కోసం తన తండ్రి పైన కేసు వేసింది. తల్లి మంజుల ఆస్తిని విజయకుమార్ లాగేసుకున్నాడు అని, తనకు ఇవ్వడం లేదు అంటూ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది.

2. కుష్బూ:The issue that brought great embarrassment'; Khushboo | Khushbu Sundar  Became Slim She explain everything here - filmyzoo - Hindisipఅందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ కూడా ఆస్తుల కోసం తన తల్లిదండ్రులపై కేసు వేసింది. మరొక సంచలన విషయం ఏమిటంటే తనకు తండ్రి అనే వాడే లేడు అంటూ సంచల వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

3. సంగీత:Sangeetha |టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గతంలో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఆస్తులను సంపాదించడం కోసమే తనను హీరోయిన్గా చేసి తన జీవితాన్ని తన తల్లిదండ్రులు నాశనం చేశారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది సంగీత.

వీరే కాకుండా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ లిజి, దునియా విజయ్ కుమార్ తదితరులు తమ తల్లిదండ్రులపై ఆస్తుల వ్యవహారాల్లో కేసు వేయడం గమనార్హం.

Share post:

Latest