హీరోయిన్ అర్చ‌న‌కు వల్గర్ మెసేజ్‌లు.. దారుణంగా టార్చ‌ర్ పెట్టిన స్టార్ హీరో…!

సినిమా రంగంలోకి అడుగుపెట్టినన వారందరూ సక్సెస్ అవ్వ‌రు. అందులో కొంద‌రు స్టార్ హీరోయిన్స్ గా. మిగిలినవారు మధ్యలోనే వెనుక తిరిగి వెళ్ళిపోతారు. తెలుగు సినిమాల్లోకి తపన అనే సినిమాతో అర్చన ఎంట్రీ ఇచ్చారు. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సామాన్యుడు, వంటి సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత అర్చన తెలుగు సినిమాలలో సరైన అవకాశాలు అందుకోలేదు. దీనికి కారణం మంచి అవకాశాలు వచ్చినా ఆమె వదులుకోవటం వల్లే ఆమె కెరియర్ మధ్యలోనే ఆగిపోయింది. ఆమె త‌మిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించారు.

తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్లో అర్చనను ఒక కంటెస్టెంట్ గా తీసుకున్నారు. అలా ఆమె తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయింది. ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న అర్చన మళ్లీ సినిమాల్లోకి రావాలని అనుకుంటోంది. ఇదే సమయంలో అర్చన చాలాసార్లు ఇండస్ట్రీలో జరుగుతున్న తప్పులు గురించి స్పందించారు. మనం మెయిల్ సెంట్రిక్ సమాజంలో ఉన్నామని అర్చన అభిప్రాయపడ్డారు. తాజాగా ఒక నిర్మాత సినిమా ఆఫర్స్ ఇస్తూ మీకు పెళ్లయింది కదాకదా రెమ్యూనిరేషన్ తగ్గించుకోవచ్చు కదా ? అన్నారు.

ఆ నిర్మాత‌ హీరోలకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా డబుల్ రెమ్యూన‌రేషన్ ఇచ్చి సినిమాలు చేయించుకుంటాడు.. హీరోలకి కూడా రెమ్యూన‌రేషన్ తగ్గించగలరా ? అంటూ హీరోల‌ను టార్గెట్‌ చేసింది.
సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలు హీరోయిన్ల‌కు ప్రాధాన్యత లేకపోతే విమర్శిస్తారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అదంతా మనకి కనిపించ‌దు. ఇక్కడ హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదు. ఇప్పుడిప్పుడే సినిమాల వాతావరణం మారుతుంది. హీరోయిన్ల‌కు కూడా తమకు కావాల్సిన పాత్రలు వస్తున్నాయి అంటూ చెప్పింది.

కెరియర్ మొదట్లో సరిగ్గా ఆలోచించుకోకుండా కొన్ని పాత్రలు చేశానని, కొంత ఆలోచన వచ్చాక మంచి పాత్రలు ఎంచుకున్నట్లు తెలిపింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో చేసేటప్పుడు అక్క‌డ‌ ఉన్న హీరోలు మెసేజ్‌లు పెట్టడంతో భరించలేక ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పకున్న‌ట్లు చెప్పింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నాకు మా అమ్మానాన్న అండగా నిలబడ్డారని.. వాళ్లే నా బలమని చెప్పుకొచ్చింది అర్చన.

Share post:

Latest