సీతారామం మూవీ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఇదే..

మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌ మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 5న అంటే ఈ రోజే విడుదలైంది. ఈ మూవీలో దుల్కర్ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. రష్మిక, సుమంత్‌ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరిశారు. స్వప్న సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై హైప్ బాగా పెంచాయి. ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌ షో ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఆల్రెడీ పూర్తయింది. ఈ సినిమా ఇప్పటికే చూసేసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా రివ్యూస్ చేస్తున్నారు. వారి ప్రకారం, ‘సీతారామం’ సినిమా స్టోరీ ఏంటి? మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సీతారామం మూవీ ఒక క్లాసిక్ అని, కథ అద్భుతంగా ఉందని ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అంటూ నెటిజన్స్‌ పేర్కొంటున్నారు. విజువల్స్‌ , టెక్నికల్‌ వ్యాల్యూస్‌ పర్లేదు అని.. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సినిమా మొదటి భాగంలో ఉన్న ప్రేమ సన్నివేశాలు, సాంగ్స్ మనసును హత్తుకునేలా చాలా బాగున్నాయని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇంటర్వెల్‌ సీన్స్‌ మళ్లీ మళ్లీ చూడాలనిపించే అంత గొప్పగా ఉందని.. సెకండాఫ్‌ లో స్క్రీన్‌ప్లే క్లాప్స్ కొట్టేలా ఉందని అన్నారు. క్లైమాక్స్‌ కూడా తనకు బాగా నచ్చేసిందని ఒక ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు.

క్లీన్ లవ్‌స్టోరీ, యూనిక్, కవితాత్మక విజువల్స్ సినిమాని అద్భుతంగా మలచాయని ఆడియన్స్ అంటున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక మార్కు క్రియేట్ చేసిన మూవీగా సీతారామం నిలిచిపోతుంది అంటున్నారు. హీరోయిన్ మృణాల్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది అని ఆమె హీరో తో చేసిన కెమిస్ట్రీ హృదయాలను దోచేసిందని కామెంట్లు పెడుతున్నారు.