₹75 జీతం.. తినడానికి కూడా తిండి లేక.. కన్నీటికి తెప్పిస్తున్న శేఖర్ మాస్టర్ కష్టాలు..!

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఇబ్బందులను మీడియాతో వెల్లడించడం జరిగింది. మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ బాగా డాన్స్ చేసేవారు. ఇక రాకేష్ మాస్టర్ లో కొత్త స్టైల్ ఉండేది. ఇక నా డాన్స్ స్టైల్ ను లారెన్స్ మాస్టర్ ప్రశంసించారు అంటూ శేఖర్ మాస్టర్ తెలిపాడు. నేను తక్కువ సినిమాలకు అప్పట్లో పనిచేశాను. ఫస్ట్ సినిమా పోస్ట్ బాక్స్ అని , కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదని శేఖర్ మాస్టర్ తెలిపారు. ఇకపోతే కెరియర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న సాంగ్స్ ఎక్కువగా చేశానని ఇక ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన తెలిపారు. ఇక ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక కథ ఉంటుంది అని ఇక అలాగే తన విజయం వెనుక కూడా ఒక కథ ఉంది అంటూ చెప్పుకొచ్చారు.Sekhar Master: Blockbuster moves - The Hindu

ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళుడబ్బులు ఇస్తారని కానీ , ఎంతకాలం అని తెచ్చుకుంటామని దొంగ చాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్లే వాళ్ళమని గుర్తుపట్ట ఉండడానికి రకరకాలుగా మాట్లాడేవాళ్ళము అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తినడానికి తిండి లేక రెండు మూడు సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన నేను ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ భోజనం చేసేవాడిని అని, ఆ సమయంలో కేవలం 75 రూపాయలు మాత్రమే పారితోషకంగా ఇచ్చేవారు అంటూ ఆయన తెలిపారు. ఇక అలాంటి సమయంలో రోజుకు కనీసం ఒక్క పూట భోజనం దొరికినా సరే చాలా సంతోషంగా అనుకునే వారము అని తెలిపిన శేఖర్ మాస్టర్ డాన్సర్ గా సెటిల్ కాకుండా వేరే జాబ్ చేస్తే శ్రద్ధ తగ్గుతుందని భావించే వాడిని అని ఆయన తెలిపారు. ఇక డాన్స్ అంటే ప్రాణం కాబట్టి ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని శేఖర్ మాస్టర్ తెలిపారు.Sekhar Master Age, Height, Son, Daughter, Wife, Family, Biography, & More

శేఖర్ మాస్టర్ తల్లి నర్సిగా పనిచేస్తే వీళ్ళ నాన్న పండ్ల వ్యాపారిగా పనిచేసేవారట. జీవితంలో ఒక స్థాయికి రావడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చారు.

Share post:

Latest