రవితేజ పిచ్చ రొమాంటిక్.. శ్రీలీల ఎక్స్ ప్రేషన్స్ టూ హాట్..ధమాకా ఫస్ట్ గ్లిమ్ప్స్ చూడాల్సిందే(వీడియో)…!!

వారెవ్వా.. ఏముంది ఫిగర్.. వావ్ సూపర్ శ్రీలల కేక పుట్టిస్తున్నావు.. మామ నువ్వు సూపర్ సూపర్ సూపర్.. ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ నే వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమా గ్లిమ్ప్స్ వీడియో క్రింద. మనకు తెలిసిందే గత కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో సరైన హిట్ లేదు. ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతున్నారు ఈ మాస్ హీరో. రీసెంట్ గా ఈ మధ్య రిలీజ్ అయిన అన్ని సినిమాలు వరుస పెట్టి అట్టర్ ప్లాప్ గా నిలుస్తున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు కానీ లోపల మ్యాటర్ నిల్ అని అర్ధమైంది.

కాగా ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ ఆశలన్నీ తర్వాత రిలీజ్ కాబోతున్న ధమాకా సినిమా పైనే పెట్టుకొని ఉన్నారు. ఈ ధమాకా సినిమాతో ధూమ్ ధామ్ హిట్ కొట్టాలి రవితేజ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో ధమాకా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది. రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ధమాకా ఫస్ట్ గ్లిమ్ప్స్ యూట్యూబ్లో యమ ట్రెండింగ్ లోకి వచ్చింది.

దానికి కారణం శ్రీ లీల ఎక్స్ప్రెషన్స్. ఈ వీడియో లో పెళ్లి వేడుక సెట్ మనం చూడవచ్చు. ఆ కళ్యాణ మండపంలో హీరోయిన్ శ్రీ లీల వైపు రవితేజ ఓవరగా చూస్తూ ఉంటాడు. మనకు ఆ వీడియో బట్టి అర్థమయిపోతుంది రవితేజ ఎక్స్ప్రెషన్స్ ఎంత రొమాంటిక్ గా ఉంటాయో. ఇక శ్రీలీల కూడా రవితేజను అంతే రొమాంటిక్ గా చూస్తూ మాస్ మహారాజా కి తగ్గ జోడిగా అనిపించింది. అంతేకాదు ఈ గ్లిమ్ప్స్ లో రవితేజ ఆమెను ఓరగా చూస్తూ కళ్ళతోమే శ్రీలీలను పక్కకు పిలుస్తుంటారు. దానికి ఈ బ్యూటి నో నో అంటూ సైగ చేయడం ఆ తర్వాత రవితేజ ఆమెను ఏదో అడగబోతూ బుంగ మూతి పెట్టుకొని ఏడుస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం.. దానికి పోనీలే పాపం అంటూ శ్రీ లీల పక్కకు రావడానికి ఒప్పుకోవడం చాలా హాట్ గా అనిపిస్తుంది.

అంతేకాదు ఈ గ్లిమ్ప్స్ మొత్తం రొమాంటిక్ గానే తీసినట్లు అనిపిస్తుంది. దీంతో ఈ సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు రవితేజ అభిమానులు. ఒక్క గ్లిమ్ప్స్ తోనే శ్రీ లీల కుర్ర కారుని ఫిదా చేస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ గ్లిమ్ప్స్ లో రవితేజ కన్నా శ్రీ లీల ఎక్స్ప్రెషన్స్ యమ హాట్ గా ఉన్నాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు మరి చూడాలి సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో..!!

 

Share post:

Latest