సినిమా స్టోరీని తలపిస్తున్న రాజీవ్ -సుమ ప్రేమ వివాహం..!

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తన ప్రయాణాన్ని కూడా మొదట బుల్లితెర మీద నుంచి మొదలు పెట్టింది. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీరిద్దరూ కూడా బుల్లితెర మీద నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాజీవ్ కనకాల ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది. ఇక తాజాగా జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా నటిగా కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా పలు వార్తలు కూడా వినిపించాయి.Suma and Rajeev Kanakala launch their new production house 'Jujube TV' -  Times of India

కానీ తాజాగా అలాంటివి ఏమీ లేదనే విషయాన్ని తెలియజేశారు. వీరిద్దరూ కలిసి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తమ ప్రేమ కథ ఎలా మొదలైందో అనే విషయాన్ని కూడా తెలియజేశారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. దూరదర్శన్ కోసం ఒక షూట్ చేస్తున్నప్పుడు సుమని మొదటిసారి చూశారట. ఇక ఆమెను చూడగానే ఎంతో బాగుంది కదా అనుకున్నాడట. కానీ ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో షూటింగ్ కోసం వెళితే అక్కడ కూడా శుభాకాంక్షలు చెప్పి ఎలా పడేయాలి అని ఆలోచించారట రాజీవ్ కనకాల.

అయితే అప్పుడు ఏమి జరగలేదట. కానీ ఆ తర్వాత మీర్ దర్శకత్వంలో తెలుగువారి పెళ్లి చిత్రీకరణ షూటింగ్ కు వెళ్లగా అందులో పెళ్ళికొడుకుగా రాజీవ్ కనకాల ఉన్నారట. అతని పక్కన వేరే అమ్మాయి నటించాల్సి ఉండగా కానీ తనకు జోడిగా సుమాను తీసుకు వచ్చారని తెలిపారు. ఆ సమయంలోనే కాస్త పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత మేఘమాల సీరియల్ లో సుమ జీడిగుంట శ్రీధర్ కు జోడిగా నటించిన ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది అని తెలిపారు ఆ తర్వాత 1999లో సుమాని వివాహం చేసుకున్నానని, అది కూడా కుటుంబ సభ్యుల సమ్మతంగానే జరిగింది అని తెలిపారు.

Share post:

Latest