పతి పాదసేవలో ప్రణీత.. నెటిజన్స్ నుంచి ట్రోల్స్..కారణం..?

ప్రణీత సుభాష్.. తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తను అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం అనగా మొన్న అమావాస్య రోజు భీమన అమావాస్య పూజలో భాగంగా తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేసిన ఫోటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.Actress Pranitha Subhash Reacts Trolls Criticising Her Photo Sitting Near  Husband Feet For Bheemana Amavasya - Pranitha Subhash

అయితే సాంప్రదాయాలను ఫాలో అవుతున్న ప్రణీత ను చూసి ప్రతి ఒక్కరూ ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటివారు ఉన్నారా అని కొంతమంది ముచ్చట పడుతుంటే.. మరికొంతమంది ఇంకా ఏ కాలంలో ఉందో అంటూ వెటకారం గా మాట్లాడుతున్నారు.. ఇక మరి కొంతమంది అయితే భర్త కూడా పాదపూజ చేయొచ్చు కదా తనే ఎందుకు చేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలా ఆమెపై రోజురోజుకు ట్రోల్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రణీత స్పందించింది. ఇక ఆమె మాట్లాడుతూ.. జీవితంలో జరిగే ఏ విషయానికైనా సరే రెండు కోణాలు వుంటాయి.. అందులో 90% మంది పాజిటివ్గా స్పందిస్తారు.. మిగిలిన వారు నోటికి వచ్చినట్లు వాగుతారు.. కానీ నేను పట్టించుకోను..ఒక నటిగా నేను గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన సాంప్రదాయాలను ..ఆచారాలను వదిలి పెట్టాల్సిన అవసరం లేదు.I am modern but how can I forget my roots, my deep faith in Sanatan Dharma'  Pranita Subhash on the worship of husband | Dailyindia.net

ఇక నేను పుట్టినప్పటినుంచి అవన్నీ చూస్తూ పెరిగాను. నా సోదరీమణులు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చేశారు. పెళ్లి అయిన కొత్తలో గతేడాది కూడా ఇదే పూజ చేశాను. కానీ ఫోటో షేర్ చేయలేదు.. నిజం చెప్పాలంటే ఇది నాకేం కొత్త కాదు.. నేనెప్పుడూ పద్ధతి గల అమ్మాయి గానే నడుచుకోవాలి అనుకుంటున్నాను. మోడ్రన్ గా ఆలోచించడం అంటే మనం నడిచి వచ్చిన దారిని మరిచిపోవడం కాదు అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest