సినిమా అరాచకం చూసి తట్టుకోలేక.. గూగుల్లో జాబ్ చేస్తున్న పవన్ చెల్లెలు..!!

ఎంతోమంది సినిమాల మీద ఆసక్తితో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగాలు చేస్తూనే.. వాటిని కాదనుకొని మరీ ఇండస్ట్రీ వైపు అడుగు పెడుతుంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం సినిమాలలో జరిగే అరాచకాన్ని చూసి తట్టుకోలేక సినిమా నుంచి దూరంగా వెళ్లిపోయింది. అంతేకాదు గూగుల్లో జాబ్ చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాలో హీరో చెల్లెలుగా నటించిన వాసుకి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఒక సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.Tholi Prema actress planning a comeback?నిజానికి వాసుకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ అంతలా పవర్ఫుల్ పాత్రలు తన దగ్గరకు రాలేదు అని ఆమె చెబుతోంది. ఇక తొలిప్రేమ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆ సినిమా కి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో ప్రేమలో పడి ఆ తర్వాత వివాహం చేసుకుని.. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి పిల్లలు బాగా పెద్దయిపోయారని చెప్పవచ్చు.. కూతురు ఎంబిబిఎస్ చదువుతోంది.. కుమారుడు ఆర్కిటెక్చర్ చదువుతున్నారు.. అందుకే తను ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదైనా పాత్ర వస్తే ఆ పాత్ర చేయడానికి వాసుకి మనసు అంగీకరించలేదు.. అంతేకాదు ఇండస్ట్రీలో జరిగే కొన్ని అరాచకాలను చూసి ఆమె తట్టుకోలేక పోయింది.Jab we met: A filmi love story

ఏదైనా జాబ్ చేసి సమయాన్ని గడపాలనుకున్న ఈమె గూగుల్ కి అప్లై చేస్తే.. అదృష్టం కొద్ది ఆమెకి గూగుల్ లో జాబ్ వరించింది. ఇక అంతే హైదరాబాద్ కి మకాం మార్చి వాసుకి ప్రస్తుతం గూగుల్ లో జాబ్ చేస్తూ భర్త ఆనంద్ సాయి కి చేదోడువాదోడుగా ఉంటుంది. ఇక ఈమె భర్త ఆనంద్ సాయి సినిమాలే కాకుండా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ఆర్కిటెక్చర్ పనులు చేయడంతో పాటు అయోధ్య రామ మందిరం పనుల్లో కూడా ఆయన బిజీగా ఉన్నారు.

Share post:

Latest