మలైకాతో పెళ్లికి సిద్ధంగా లేను.. అర్జున్ కపూర్..!

గత రెండు సంవత్సరాల క్రితమే మలైకా అరోరాతో అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్న విషయాన్ని మీడియాతో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఇక బహిర్గంగా వీరి ప్రేమ గురించి చెప్పిన తర్వాత వీరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కోడై కూస్తుండగా ఈ వార్తలపై అర్జున్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపోతే ఇటీవల కాఫీ విత్ కరణ్ షో కి అతిథిగా వచ్చిన అర్జున్ కపూర్ మలైకాతో ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించడం జరిగింది.Arjun Kapoor and Malaika Arora get cosy in Paris, see PICS of their fashionably-casual vacation! | News | Zee News

అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. నేను మలైకాను ఇప్పుడే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేను. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా రెండు సంవత్సరాలు నా సినిమాలు లేక సమయం గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరియర్ మీద దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా నా పని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది.. నేను సంతోషంగా ఉంటేనే కదా నా భాగస్వామిని సంతోషంగా ఉంచగలను.. లేకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు.. చివరికి వివాహం తర్వాత విడాకులకు దారి తీసే ఆస్కారం కూడా ఉంది. అందుకే నేను పెళ్లి ఆలోచనలేమి చేయట్లేదు అంటూ తెలిపారు.Malaika Arora and Arjun Kapoor to marry in 2022, astrologer predicts their  future post wedding | Malaika News – India TV

ఇక ఒక స్థానానికి చేరుకున్న తర్వాత కచ్చితంగా వివాహం చేసుకుంటానని తెలిపిన అర్జున్ కపూర్ ఆర్థికంగా కాదు మానసికంగా ఆనందంగా ఉన్నప్పుడే నేను తనను సంతోష పెట్టగలను అంటూ వెల్లడించారు.ఇక అర్జున్ కపూర్ మాటలను బట్టి చూస్తే తప్పకుండా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ సమయం ఇంకా దగ్గర పడలేదు అంటూ నిరాశ చెందుతున్నారు అభిమానులు. మొత్తానికైతే అర్జున్ కపూర్ మలైకా అరోరా ను వివాహం చేసుకోవాలి అని, తమ జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలని అభిమానుల సైతం ఆకాంక్షిస్తున్నారు.

Share post:

Latest