మ‌హేష్‌ను గ‌ట్టిగా వాటేసుకున్న న‌మ్ర‌త‌… వావ్ ఏ పిక్‌..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలలో ఎంత అయితే బిజీగా ఉంటారో కుటుంబానికి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే నమ్రత ఇటు మహేష్ బాబు మధ్య బాండింగ్ మరింత బలపడిందని చెప్పవచ్చు . ముఖ్యంగా మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాలను కూడా నమ్రత దగ్గరుండి చూసుకోవడమే కాకుండా ఆఖరికి మహేష్ బాబు వేసుకునే దుస్తులను కూడా ఆమె సెలెక్ట్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబు నమ్రతా పై ఎంతలా ప్రేమ పెంచుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన భార్య నమృత అలాగే పిల్లలతో స్విజర్లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక ఈరోజు నమ్రత శిరోద్కర్ తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా మరొక బ్యూటిఫుల్ ఫోటోను ప్రేక్షకులతో పంచుకుంది. ఇకపోతే ఆమె తన భర్తను చాలా ప్రేమగా కౌగిలించుకున్న ఫోటోలు షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. అంతేకాదు దానికి క్యాప్షన్ కూడా ఇచ్చింది నమ్రత.. సెయింట్ మోర్టిజ్ ఇది. నథింగ్ కంపేర్ టు యు అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మహేష్ బాబు తన 28వ సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే .. మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటిస్తున్నది. ఇక అంతే కాదు మిగతా నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Share post:

Popular