మహేష్ బాబును నమ్మి దారుణంగా మోసపోయిన ఇన్వెస్టర్లు..?

సెలబ్రిటీలన్న తర్వాత ఒక దానిని సపోర్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సెలబ్రెటీలు హోదాలో ఉన్నప్పుడు వాళ్లు చెప్పే ప్రతి మాట జనాలపై ప్రభావం చూపుతుంది. సెలబ్రిటీలు చెప్పేది నిజమేనని కొందరు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయాల అనేవి ప్రజలకు హానికరం కాకుండా ఉండాలి. లేదంటే సెలబ్రిటీకి తిప్పలు తప్పవు. ఇక సినిమా హీరోలు తమకు నచ్చిన బ్రాండ్‌ని ప్రచారం చెయ్యొచ్చు.

 

కానీ రియల్ ఎస్టేట్ సంస్థల కోసం పని చేస్తున్నప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జనాలు రిస్క్ లో పడినట్లే. ఎందుకంటే ఈ సంస్థలు ఎప్పుడు నష్టాల్లో పడిపోతాయో, ఎప్పుడు తట్టా బుట్టా సర్దుకుని పోతాయో ఎవరూ ఊహించలేరు. అందుకే ఈ కంపెనీలకు ప్రచారం చేసేందుకు తక్కువమందే ముందుకు వస్తారు. ఈ కారణంగా ఈ కంపెనీలు హీరోలకు కోట్లాది రూపాయలు చెల్లించి ఆకర్షిస్తుంటాయి. కానీ అవి బోర్డు తిప్పిస్తే సెలబ్రిటీలను నమ్మిన వారి పరిస్థితి ఏంటి ? అనేదే అసలు ప్రశ్న.

సినీ వర్గాల్లో జరుగుతున్న టాక్ ప్రకారం, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి పరిస్థితులలోనే చిక్కుకున్నాడు. అతడు డైరెక్టర్ అయిన తన స్నేహితుడిని నమ్మి, విజయవాడలో భారీ రెమ్యునరేషన్ పుచ్చుకొని ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌ను ఎండార్స్ చేశాడు. ఈ డైరెక్టర్ ఒక ప్రకటన మహేష్ బాబుతో కలిసి తీయించాడు. మహేష్ బాబు ఉన్నటువంటి హోర్డింగ్‌లు, వీడియోలు విజయవాడ అంతటా హల్ చల్ చేశాయి. ఈ ప్రకటనను జనాలందరూ కూడా చూశారు.

మహేష్ బాబు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో భయం లేకుండా డబ్బులు పెట్టొచ్చనే ధీమాతో చాలామంది భారీగా పెట్టుబడులు పెట్టారట. ఈ కంపెనీకి ఎక్కువగా లాభాలు వస్తే పెట్టుబడిదారులకు కూడా లాభాలు వస్తాయి కానీ ఇప్పుడు కంపెనీ అసలుకే దివాలా తీసిందని అంటున్నారు. దాంతో పెట్టిన పెట్టుబడి అంతా పోయిందని పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు నమ్మదగినదా కాదా అనేది అంచనా వేయకుండా దానిని ప్రచారం చేశారని, దీనివల్ల చాలామంది ఘోరంగా నష్టపోయారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై మహేష్ బాబు స్పందిస్తే కానీ అభిమానులకు క్లారిటీ రాదు.

Share post:

Latest