ఆ హీరోయిన్ ని దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట… కానీ ఆఖరికి ఆమెతో జరిగింది!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే ఎవరో తెలియనివారు వుండరు. రాజు ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఓ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తాడు. అంత ముందుచూపు వున్న నిర్మాత కనకే ఇప్పటికీ అతనే బడా నిర్మాతగా కొనసాగుతున్నాడు. అలాగే ఏ సినిమా ఎప్పుడు విడుదల అవ్వాలో, విడుదలయ్యాక ఎన్ని రోజులకు ఓటీటి లో రావాలో ఇలా సినిమాల విషయంలో మొత్తం ఆయనే చూసుకుంటారు. అలాగే ఇప్పుడు భారీ సినిమాలు తీస్తూ సక్సెస్ అవుతున్నాడు.

ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య చనిపోవడంతో ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. అయితే ఈయన ముందుగా ఓ హీరోయిన్ ని వివాహం చేసుకుందాం అనుకున్నాడట. ఈమె ఇద్దరు స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా నటించి హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి మెల్లిమెల్లిగా కనుమరుగైపోయింది. అయితే ఆమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ దిల్ రాజు తో మాత్రం టచ్ లోనే ఉంటూ దిల్ రాజుతో స్నేహాన్ని కంటిన్యూ చేస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో దిల్ రాజు ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నారట.

కానీ ఆ హీరోయిన్ మాత్రం నేను నా లైఫ్ లో ఇక పెళ్లి అనేది చేసుకోను అని తెగేసి చెప్పడంతో ఇక చేసేదేమీలేక తేజస్విని పెళ్లి చేసుకున్నాడు దిల్ రాజు. ఈ మధ్యనే వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరో అన్న విషయం మాత్రం గోప్యంగా ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ విషయమై ఓ వర్గం వారు విమర్శలు కూడా చేస్తున్నారు. ఏదిఏమైనా దిల్ సినిమాతో దిల్ నే తన ఇంటిపేరుగా మార్చుకొని దిల్ రాజు అవతరించారు ఈ బడా నిర్మాత.

Share post:

Latest