రమ్యకృష్ణ-కృష్ణవంశీ మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అగ్ర డైరెక్టర్లలలో కృష్ణవంశీ కూడా ఒకరు. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు. కొంతకాలంగా ఆయన నుంచి వచ్చిన చిత్రాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రాలలో గులాబీ ,ఖడ్గం, అంతపురం, మురారి వంటి సినిమాలు సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు కృష్ణవంశీ.. ఇక ప్రస్తుతం రంగమార్తాండ సినిమా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు కృష్ణవంశీ. ఈ క్రమంలోనే రంగమార్తాండ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు కృష్ణవంశీ.. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.Director Krishna Vamsi Gives Clarity About Ramya Krishnan Divorce Rumorsరమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య పలు విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ పై స్పందించిన కృష్ణవంశీ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తమ వైవాహిక జీవితం గురించి వచ్చే వార్తలను అసలు మేము పట్టించుకోమని తెలిపారు. వివాహం జరిగినప్పుడు నుంచి రమ్యకృష్ణ ఇష్టాలను తను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉన్నానని తెలిపారు. చేయకూడదు అంటూ ఏమైనా చెప్తారా.. అని యాంకర్ ను ప్రశ్నించగా.. ఫుడ్ విషయంలో ఆమె జాగ్రత్తలు చెబుతుందని ఆమె ఏం చెప్పినా కూడా చాలా బ్లైండ్ గా ఫాలో అవుతానని తెలిపారు కృష్ణవంశీ.Heroines who fell for their directorsఇక ఆమె ఒక ఏంజెల్ అని అన్ని విషయాలలో కూడా అందరికీ నచ్చుతుందని కృష్ణవంశీ తెలిపారు. తన తదుపరి సినిమాలలో రమ్యకృష్ణ సరైన పాత్ర ఉంటే చేయాలని అడుగుతానని.. ఆమెకు డేట్స్ కుదిరితే నటిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు.

Share post:

Latest