వ‌ర‌ల్డ్‌వైడ్ ‘ కార్తీకేయ 2 ‘ 15 డేస్ క‌లెక్ష‌న్స్‌… ఇదేం అరాచ‌కం రా సామీ..!

సౌత్ సినిమాలు నార్త్ సినిమాల‌పై దండ‌యాత్ర చేస్తున్నాయి. ప్ర‌ధానంగా తెలుగు సినిమాలు హిందీ సినిమా ఇండ‌స్ట్రీకి చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తునాయి. తెలుగు నుండి వ‌చ్చిన బాహుబ‌లి సినిమా మొద‌లుకుని బాహుబలి సినిమా మొదలుకొని త్రిబుల్ ఆర్ సినిమా వరకు హిందీ సినిమాలపై తెలుగు సినిమాల‌పై చేయి సాధించాయి. వీటితో పాటు సౌత్ నుంచి కేజీఎఫ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇదే క్రమంలో తెలుగు నుంచి యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

Karthikeya 2 trailer is out!- Cinema express

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్‌లో అమీర్ ఖాన్- అక్షయ్ కుమార్ వంటి అగ్ర హీరోలు సినిమాలు వచ్చినా వాటిని త‌ట్టుకుని కార్తీకేయ 2 సూప‌ర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ సినిమా బాలీవుడ్‌లో ఏకంగా రు. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది, దీంతోపాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దుసుకుపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 1.3 మిలియన్ మార్కు దాటేసింది. ఈ సినిమా లాంగ్ రన్ లో రు. 2 మిలియన్లు దాటుతుందని అంటున్నారు.

Karthikeya 2': Motion Poster introduces a mystical element - Telugu News - IndiaGlitz.com

ఈ సినిమా సౌత్‌లో ఏకంగా 50 కోట్ల క్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేంజ్ లో వచ్చాయి. నిఖిల్‌ కెరియర్ లోనే ఎప్పుడో లేనంతగా ఈ సినిమాకు శాటిలైట్ రేటు వ‌చ్చింది. కార్తీకేయ 2కు ఏకంగా 16 కోట్లు శాటిలైట్ రేటు ప‌లికింది. దీంతో ఈ సినిమా రు. 100 కోట్ల మార్కును దాటేసింది. ఈ సినిమా మాత్రం ఏడాదిలో బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

 

 

Share post:

Latest