శ్రీహరి మరణం వెనక ఇంత మిస్టరీ ఉందా…పర్మీషన్ లేకుండా ఆ ఇంజక్షన్ ఎందుకు చేసారు..!? 

తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప పేరు తెచ్చుకున్న నటుల్లో శ్రీహరి కూడా ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో విలన్ పాత్రలో నటించి జనాలను మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా అడుగుపెట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఈఅయన విలన్ గా హీరో గానే కాకుండా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. పాత్ర ఏదైన శ్రీహారి నటన ను చూస్తే మాత్రం…క్లాప్స్ కొట్టాల్సిందే. ఇలా అన్ని పాత్రల్లో నటించి మెప్పించిన ఈయన సినీ చరిత్రలో గొప్ప నటుడుగా మిగిలిపోయారు. ఈయన చనిపోయి సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటికీ శ్రీహరిని తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

శ్రీహరి ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పాలంటే ఈయ‌న‌ డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు. సోసైటీలో మ్మచి పేరు సంపాదించుకున్న ఈయన అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం. అయితే , ఈయన మరణం గురించి..ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దానికి కారణం ఇటీవల డిస్కో శాంతి శ్రీహరి చివరి క్షణాల గురించి మీడియాతో చెప్పటమే. శ్రీహరి తెలుగులో కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాల్లో నటించారన్న సంగతి మనకు తెలిసిందే.

తన చివరి రోజుల్లో ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా తరికెక్కిన ఆర్. రాజ్ కుమార్ సినిమా షూటింగ్లో తీవ్ర అస్వస్థకు గురి అవ్వడంతో వెంటనే డాక్టర్లకు ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి ఆయనను చెక్ చేసి నీరసంగా ఉందని సెలైన్ పెట్టారట. కొద్దిసేపటికే నర్సు వచ్చి ఏదో ఇంజక్షన్ కూడా ఇచ్చారట. అయితే కొద్దిసేపటికే వాళ్లు మళ్లీ వినిపించుకోకుండా వేరే ఇంజక్షన్ కూడా ఇచ్చారట.

ఆ తర్వాత ముంబైలోని లీలావతి హాస్పటల్లో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టారట. అప్పుడు శ్రీహరి భార్యను లోపలికి వెళ్ళనివ్వకపోతే ఆమె చాటుగా వెళ్లి చూసేసరికి శ్రీహరి బెడ్డు మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ సమయంలో బాధను తట్టుకోలేక గట్టిగా ఏడవడంతో తనును బయటికి తోసేసారని డిస్కో శాంతి చెప్పారు. అప్పుడు డిస్కో శాంతి తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మన్నారట. ఆ తర్వాత ఆమె శ్రీహరి దగ్గరికి వెళ్లి చూడడంతో అప్పటికే నర్స్ వచ్చి సెలైన్ బాటిల్ లో ఇంజక్షన్ ఇవ్వడం… శ్రీహరిని చూసి తట్టుకోలేకపోయింది.

అప్పుడు చుట్టూ చూసి ఇక్కడ డాక్టర్లు ఏదో తప్పు చేశారని. లివర్ సమస్య ఉందని తెలిసినప్పుడు.నేరుగా ఇంజెక్షన్ ఇవ్వడం తో లివర్ కి గుచ్చుకోవడంతో రక్తం ఎక్కువగా పోయిందని ఆమె చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీహరి ..2013 అక్టోబర్ 9 మన మరణించారు. ఆ రోజు సినీ పరిశ్రమ మొత్తం కన్నీరు మున్నీరు గా విలపించారు.

Share post:

Latest