నటుడు నరసింహారాజు బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆస్తులను కూడబెట్టె ప్రయత్నంలో ఉంటారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ నటుడు విఠలాచార్య సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నరసింహారాజు కూడా ఒకరు. 1970లో అనేక విజయవంతమైన జానపద సినిమాలలో హీరోగా నటించిన ఈయన ఆంధ్ర కమలహాసన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్మోహిని సినిమాతో ఘనవిజయాన్ని సాధించి.. ఏకంగా 110 సినిమాలలో హీరోగా నటించి.. చివరిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా , తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపించే ప్రేక్షకులను మెప్పించాడు.Jaganmohini (1978)

అంతేకాదు అవకాశాలు తగ్గిన సమయంలో కూడా ఇండస్ట్రీపై ఉన్న ప్రేమతో వెండితెరను వదిలి బుల్లితెరపై కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు అని చెప్పవచ్చు. ఇక పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం లో మట్లూరు అనే గ్రామంలో 1951 డిసెంబర్ 26వ తేదీన నరసింహారాజు జన్మించారు. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే సినిమాపై ఆసక్తి కలగడంతో మద్రాస్ కు వెళ్ళిపోయారు. ఇకపోతే నరసింహారాజు తండ్రి అప్పట్లో బాగా ఉన్నతంగా ఆస్తులు కలిగి ఉన్నవారు. కాకపోతే ఆయనకు దానధర్మాలు చేసే గుణం ఎక్కువ కావడంతో ఉన్న ఆస్తిని మొత్తం ఇలా దానధర్మాలకి ఇచ్చేశారు.Jaganmohini Songs - Kadatava Jodi - Jayamalini, Narasimha Raju - HD -  YouTubeనరసింహారాజుకి చెన్నై వెళ్ళిన తర్వాత విఠలాచార్య పరిచయం అవడంతో ఇక ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. ఇక ఈయన వ్యక్తిగత జీవితం విషయంలోకి వస్తే..ఒక కుమారుడు.. ఒక కుమార్తె కూడా ఉన్నారు. కుమార్తె మెహదీపట్నంలో పలు కళాశాలలకు హెచ్ ఆర్ గా పనిచేస్తుండగా.. కుమారుడు కెనడాలో సెటిల్ అయ్యాడు. నరసింహారాజు సినిమాల ద్వారా ఏమి సంపాదించలేకపోవడంతో కొడుకు అయినా సరే గట్టిగా సినిమాలలో నటించాలని కోరుకున్నప్పటికీ.. నరసింహరాజు అందుకు ఒప్పుకోలేదు. అందుకే నరసింహరాజు కొడుకు కెనడా లో ప్రొఫెసర్ గా స్థిరపడ్డాడు. అంతేకాదు వీరికి కెనడాలో 10 ఎకరాల గార్డెన్ తో పాటు 2 ప్యాలెస్ లు కూడా ఉండడం గమనార్హం. ప్రతి వేసవి కాలంలో కూడా నరసింహరాజు తన కొడుకు దగ్గరికి వెళ్లి అక్కడే కాలక్షేపం చేస్తారని సమాచారం. తండ్రులు సాధించలేని ఎన్నో ఘనతలను వారి వారసులు సాధించి నిరూపిస్తున్నారు అని చెప్పవచ్చు.

Share post:

Latest