హైపర్ ఆది ఎవ్వరినీ వదిలిపెట్టడు… జానీ మాస్టర్ మీద పంచులే పంచులు!

హైపర్ ఆది పరిచయం అక్కర్లేదేమో. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన హైపర్ ఆది అనతికాలంలోనే తన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అంతవరకూ ఓ మూసధోరణిలో నడుస్తున్న జబర్దస్త్ షో హైపర్ ఆది అడుగుపెట్టడంతో మరో లెవల్ కి వెళ్ళిపోయింది. దాంతో ఆ షోలో ఉన్నటువంటి కంటిస్టెంట్లు హైపర్ ఆదిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాతి కాలంలో ఢీ షోలో కూడా హైపర్ ఆది తనదైన మాటతీరుతో ఆహుతులను ఆలరిస్తున్నాడు. ప్రస్తుతం ఢీ షోకు కర్త కర్మ క్రియ అంతా కూడా ఆది అన్నట్టు నడుస్తుంటుంది.

ఆది ఒకప్పుడు ఢీ షోకు రైటర్‌గా పని చేస్తుండే వాడు. అలా మొత్తానికి ఆది తెర ముందు తెర వెనుకా ఢీ షోను నడిపిస్తుంటాడు. అందుకే ఆదినే అందరి మీద పంచులు వేస్తుంటాడు. ఈ క్రమంలో ఆది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా తయారయ్యింది. ఇకపొతే ఆది జడ్జ్‌లను కూడా వదిలిపెట్టడు. అందరినీ తనదైన మార్క్ పంచులతో ఆడుకుంటాడు. మరీ ముఖ్యంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల పరువుతీయడంలో ఆది ఎప్పుడూ ముందుంటాడు. వారికి ఆడవాళ్ల పిచ్చి ఉందన్నట్టుగా ప్రోజెక్ట్ చేయడంలో ఆది వేసే పంచులే కారణం. ఆది ఆ ఇద్దరినీ అమ్మాయిల వీక్ నెస్ ఉందన్నట్టుగా మార్చేశాడు.

తాజాగా అలాంటి పరిస్థితి జానీ మాస్టర్ ఫేస్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో హైపర్ ఆది తెగ రెచ్చిపోయాడు. ఈ ప్రోమోలో హీరోయిన్ శ్రద్దా చెవిలో జానీ మాస్టర్ ఏదో చెబుతాడు. నా శ్రద్ద అంతా కూడా మాస్టర్ మీదే అని శ్రద్దా దాస్ అంటుంది. ఇది నువ్ చెప్పావా? ఆయన చెప్పమన్నాడా? అంటూ జానీ మాస్టర్ మీద కౌంటర్లు వేస్తాడు ఆది. ఇంకో సందర్భంలో శ్రద్దా దాస్ చెవిలో ఏదో చెప్పబోతాడు జానీ మాస్టర్. ఇక ఆయన మొదలుపెట్టాడు.. మొదలుపెట్టాడంటే వదలడు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లో జానీ మాస్టర్ పరువుతీస్తాడు ఆది. కాగా ఈ ప్రోమో తెగ నవ్వులు పూయిస్తోంది చూసేయండి మరి!

Share post:

Latest