టాటూ వేసుకుంటే.. హెచ్ఐవి వచ్చింది.. వారణాసిలో ఏం జరిగింది?

అసలు పెళ్లి కాలేదు.. ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు.. కానీ ఆ యువకులకు హెచ్ఐవి పాజిటివ్ గా వచ్చింది. వారణాసిలోని పిటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో 12 మంది యువకులకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు వెల్లడైంది.. అయితే హెచ్ఐవి వచ్చిన వారు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు.. వారికి అసలు పెళ్లి కూడా కాలేదు.. దీనిపై విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

వారణాసిలోని ఓ ప్రాంతానికి చెందిన యువకుడు ఇటీవల సరదాగా టాటూ వేయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించింది. వారికి జ్వరం వచ్చిన చాలా బలహీనంగా మారాడు. ఎన్ని మందులు ఇచ్చానా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో వైద్యులు హెచ్ఐవి పరీక్షలు చేయించారు. పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అంతే అతడు షాక్ అయ్యాడు. అయితే రిపోర్టులను అతను నమ్మలేదు. తాను ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదని, రక్తం కూడా ఎక్కించుకోలేదని వైద్యులతో అన్నాడు. అతని మాటలు విన్న డాక్టర్లు షాక్ అయ్యారు.. అసలు వారికి హెచ్ఐవి ఎలా సోకిందన్న దానిపై విచారించారు.. అతను వేయించుకున్న టాటూ గురించి ఆరాతీశారు. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు.

నాగవాన్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ ఒక యువతి ఓ హాకర్ నుంచి పచ్చబొట్టు వేయించుకుంది. కొన్ని రోజులకు అనారోగ్యానికి గురైంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా యువతికి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఇన్ఫెక్షన్ సోకిన సూదిని టాటూ వేయడానికి ఉపయోగించడంతోనే వారికి హెచ్ఐవి సోకినట్లు వైద్యులు తెలిపారు.

టాటూలు వేయడానికి ఉపయోగించే సూదులు చాలా ఖరీదైనది.. ఒక కస్టమర్ కి టాటూ వేసిన తర్వాత ఆ సూదిని పారేయాలి. కానీ కొంతమంది డబ్బు కోసం ఒకే సూదిని ఎక్కువ మందికి ఉపయోగిస్తున్నారు. అందుకే టాటూలు వేయించుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ హెచ్ఐవి ఉన్న వ్యక్తికి టాటూ వేసిన తర్వాత.. అదే సూదితో మనకు టాటూ వేస్తే హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. అందుకే పచ్చబొట్టు వేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు టాటూ వేసే మెషీన్ లో కొత్త సూది మార్చాడో లేదో చెక్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Share post:

Latest