గత ఆరేళ్ల నుంచి అతడి నరకయాతన.. ఇప్పటికైనా తగ్గేనా..నిత్యామీనన్..!

ఏ సినీఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్ల పై రూమర్స్ ట్రోల్స్ అనేవి సహజం. కానీ వాటన్నిటికీ దూరంగా ఉండాలనుకోవడం కష్టమనే చెప్పాలి. అయినా కూడా దూరంగా ఉంటూ.. తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయే నటీనటులలో నిత్యమీనన్ కూడా ఒకరు. ఇక ఈమె తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ నచ్చకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమాలైనా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఏ రోజు కూడా డబ్బు కోసం ఇష్టం లేని పాత్రలను చేయలేదు నిత్యామీనన్.ఇకపోతే తాజాగా తొలిసారి తనపై జరిగిన వేధింపులపై మొదటిసారి స్పందించింది ఈ ముద్దుగుమ్మ. నిత్యామీనన్ తాజాగా 19(1)(a) అనే మలయాళం చిత్రంలో నటించగా.. ప్రస్తుతం ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.What do you think of actress Nithya Menon? - Quoraఈ సినిమా ప్రమోషన్స్ లో తన పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పుకొచ్చింది నిత్యామీనన్. ఒక మూవీ రివ్యూలు ఇచ్చే వ్యక్తి తనను గత ఆరు సంవత్సరాలుగా వేధిస్తున్నాడనే విషయాన్ని బయటపెట్టి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్గా కూడా తనను టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఎమోషనల్ అయింది. ఇకపోతే ఆ రివ్యూయర్ చెప్పే మాటలు వింటే ఎవరైనా సరే ఫూల్స్ అయిపోతారని కొట్టి పారేసింది. ఇక అతడు బాగా వైరల్ అయిన తర్వాత తన దగ్గరికి నేరుగా వచ్చి మాట్లాడాడని చెప్పింది. అయితే అతడి వేధింపులు భరించలేక పోలీస్ కేసు పెట్టమని తన స్నేహితులకు కూడా సలహా ఇచ్చారట. తనకు మాత్రమే కాకుండా తన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు అని అతని గురించి చెప్పింది. ముఖ్యంగా అతడికి సంబంధించిన 30 ఫోన్ నెంబర్లను తను బ్లాక్ చేశానని తెలిపింది నిత్యామీనన్.

అతడు పేరు మాత్రం బయట పెట్టలేదు ఏది ఏమైనా ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే నిత్యామీనన్ కూడా ఇలా ఎవరో ఒకరి వల్ల వేధింపులకు గురి అవుతుంటే ఆమె అభిమానులు మాత్రం వాడి పేరు చెప్పండి మేడమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest