కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న హీరోయిన్ రాశి.. టాలీవుడ్ పట్టించుకోవడం లేదా?

సీనియర్ హీరోయిన్ రాశి గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆనాడు మంచి మంచి సినిమాలలో నటించి సినిమా ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రస్తుతం కష్టాల వలయంలో నలిగిపోతుంది అంటే మీరు నమ్ముతారా? బేసిగ్గా సెలిబ్రిటీ అయినటువంటి రాశి కష్టాల్లో ఉందంటే ఎవరు నమ్మరు. కానీ ఇది నిజం. ఓ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె ప్రస్తుతం అవకాశాలు లేక ఎకనామికల్ గా చాలా సఫర్ అవుతోంది. ఎమన్నా సాయం అడిగితే.. నీకేంటి సినిమా హీరోయిన్ వి అంటున్నారట. అవును… రాశికి సాయం చేసే వారే కరువు అయిపోయారు మన టాలీవుడ్లో.

సినిమా హీరోయిన్ అనగానే కోట్ల సంపాదన అనుకుంటారు. కానీ సినిమా వాళ్ల కష్టాలు వారికే నిజంగా తెలుస్తుంది. వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటాయి. హీరోయిన్ అవ్వడం ఎంత కష్టమో, ఆ హీరోయిన్ ఇమేజ్ ను మెయింటైన్ చేయడం, అలాగే డిమాండ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడం కూడా అంతే కష్టం. ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయం ఏమిటంటే.. సినిమా లేకపాయినా ప్రతి హీరోయిన్ గ్లామర్ కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇండస్ట్రీ ఆమెను హీరోయిన్ గా గుర్తించదు, హీరోయిన్ అంటే.. అందాల నిధిలా ఉండాలి. అలా ఉండకపోతే ఛాన్స్ లు రావు అని హీరోయిన్లు ఎప్పుడు భయపడుతూ ఉంటారు.

అందుకే, చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటున్నారు. ఏది ఏమైనా సినిమా కష్టాలు ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసే అప్ కమింగ్ అమ్మాయిలకు అయితే అన్నీ కష్టాలే. ఐతే, హీరోయిన్ రాశి పరిస్థితి ఇప్పుడు ఇంతకన్నా అధ్వానంగా ఉంది. రాశి సీనియర్ హీరోయిన్ అయిపోయింది. ఛాన్స్ లు లేవు. చివరకు సీరియల్స్ లో కూడా నటిస్తోంది. రోజుకు ఐదు వేలు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే సినిమాల్లో అవకాశాలు తక్కువ, అప్పులు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి క్యారెక్టర్ నటిగా రాశికి మంచి పేరు ఉంది. అయినా ఛాన్స్ లు రావడం లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఆమె నిర్మాతగా అప్పట్లో కొన్ని సినిమాలు చేసింది. అప్పుడు ఆస్తులు పోగొట్టుకుంది. ఆ తర్వాత నటిగా కూడా సక్సెస్ కాలేకపోయింది.

Share post:

Latest