విల్ చైర్ లో మైక్ టైసన్ ను చూసి ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్..!!

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో మొదటిసారిగా భారతీయ సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్. దీంతో ఎప్పుడుడేప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అంటూ టైసన్ అభిమానులు , విజయ్ దేవరకొండ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే మైక్ టైసన్ కు సంబంధించి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు లైగర్ ప్రమోషన్లలో చాలా బిజీగా గడిపిన మైక్ టైసన్ ఇప్పుడు వీల్ చైర్ లో కూర్చొని కదలని పరిస్థితుల్లో కనిపించడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.Boxing legend Mike Tyson spotted in wheelchair at Miami; pics go viral - Hindustan Times

ఇక అంతే కాకుండా ఒక చేతిలో వాకింగ్ స్టిక్ కూడా ఉన్నది ఈ ఫోటోలను చూసిన అభిమానులు మైక్ టైసన్కు ఏమైందంటూ నెట్లో సెర్చింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక అంతే కాకుండా లైగర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన సడన్గా ఇలా ఎందుకు అయిపోయారు అంటూ టెన్షన్ పడుతున్నారు. మైక్ టైసన్ కదలలేని పరిస్థితిలో వీల్ చైర్ లో ఉన్నప్పటికీ కొందరు ఆయనతో సెల్ఫీలు దిగడం కోసం చాలా ఎగబడుతున్నారు. అయితే మైక్ టైసన్ గత కొంతకాలంగా వెన్నునొప్పి .. సయాటీకా సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

అందుచేతనే వైద్యులు మైక్ టైసన్ ను వీల్ చైర్ ను ఉపయోగించాలని వైద్యులు సూచించారట ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం మైక్ టైసన్ వయసు 56 సంవత్సరాలు ఇటీవల ఒక సందర్భంలో తన ఎక్స్పైర్ డేట్ దగ్గర పడుతుంది అంటూ కొన్ని వాక్యాలు కూడా చేశారు.. కాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్నది. ప్రస్తుతం మైక్ టైసన్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest