బింబిసార దర్శకుడు ఏ సినిమాలో నటించాడో తెలుసా..?

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం బింబిసారా. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాని డైరెక్టర్ వశిష్టి మల్లీడి దర్శకత్వం వహించారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని అభిమానులు సాధారణ ప్రేక్షకులు సైతం కోరుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ నటించిన తీరు కి ప్రేక్షకులు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు.Director Vasishta Interesting Comments About Bimbisara Movie, Deets Insideఇక అంతే కాకుండా కొత్త డైరెక్టర్ ను నమ్మి కళ్యాణ్ రామ్ ఇలాంటి అవకాశం ఇచ్చారరు. దీంతో దర్శకుడు కళ్యాణ్ రామ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాలని ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు . ఈ డైరెక్టర్ అసలు పేరు మల్లిడి వేణు. ఇక ఈయన డైరెక్టర్ కాకుండా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈయన హీరోగా ఒక సినిమాలో నటించారు. ఆ సినిమానే ” ప్రేమలేఖ రాశా”. ఈ సినిమాలో ఈయన హీరోగా నటించడం విశేషం. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఇక మళ్ళీ హీరోగా ఏ ప్రయత్నాలు చేయలేదు. ఇక ఈ డైరెక్టర్ తండ్రి కూడా టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా ఉండేవారు.అయితే బింబిసారా సినిమా కంటే ముందు కళ్యాణ్ రామ్ కు రెండు కథలు చెప్పగా.. ఆ రెండు కథలు నచ్చకపోవడంతో వదిలేశారు .అయితే ఈ సినిమా కథ చెప్పడంతో ఈ సినిమా ఒప్పుకోవడంతో ఈ సినిమాని తన బ్యానర్ పైన నిర్మించడానికి సిద్ధమయ్యారు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమా ప్రమోషన్లలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా తెరకెక్కించే అవకాశం ఉంటుంది అని తెలియజేశారు కళ్యాణ్ రామ్. అయితే ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.

Share post:

Latest