భవిష్యత్తులో సమంతాతో నటించడంపై క్లారిటీ ఇచ్చిన చైతూ..!!

యువ సామ్రాట్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య ప్రస్తుతం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలకపాత్రలో నటించిన నాగచైతన్య తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు నాగచైతన్య పలు ప్రమోషన్స్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో నాగచైతన్య నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య సమంత గురించి కూడా మాట్లాడడం జరిగింది..Samantha and I've moved on but unfortunately....: Naga Chaitanya speaks on  his divorce, reveals reason behind his 'silence' | People News | Zee Newsసమంత తో సినిమాలలో అవకాశం వస్తే..మీరు కలిసి నటించే అవకాశం ఉందా ? అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు చైతన్య గట్టిగా నవ్వేశాడు. ఇకపోతే ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ అది జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఈ ప్రపంచానికే తెలియాలి అంటూ నాగచైతన్య సమాధానం ఇచ్చారు. ఒకవేళ దేవుడు కరుణించి..కాలం కలిసి వస్తే చూడాలని అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా నాగచైతన్య థాంక్యూ సినిమా ద్వారా పూర్తి డిజాస్టర్ ను మూటకట్టుకున్నాడు. ఇకపోతే బంగార్రాజు, లవ్ స్టోరీ వంటి సినిమాలకు మంచి విజయాలను సొంతం చేసుకున్న నాగచైతన్య.. ఇలా థాంక్యూ సినిమా డిజాస్టర్ కావడంతో పూర్తిగా ఢీలా పడిపోయాడు.

ఇకపోతే తాజాగా చైతన్య అభిమానులు లాల్ సింగ్ చద్దా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరి లాల్ సింగ్ చద్దా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగచైతన్య త్వరలోనే అవకాశం వస్తే బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కి పిలుపు వస్తే ఖచ్చితంగా వెళ్తాను అంటూ ప్రమోషన్స్ లో భాగంగానే వెల్లడించారు. మరి ఆయన నిజంగానే ఆ షో కి వెళ్తే సమంత గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.

Share post:

Latest