బింబిసార ప్రీమియ‌ర్ షో టాక్‌… ర్యాంప్ ఆడేసిన క‌ళ్యాణ్‌రామ్‌..!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరికెక్కించిన చిత్రం..బింబిసార. ఈ సినిమాని టైమ్ ట్రావెల్ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని M.M. కీరవాణి అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వాటి గురించి చూద్దాం.

- Advertisement -

బింబిసార సినిమా స్టోరీ విషయానికి వస్తే థ్రిగర్థల సామ్రాజ్య అధినేత.. బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించారు. ఏ మేరకు ప్రేక్షకులను అలరించాడు వారి యొక్క అభిప్రాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథల ప్రకారం తెలుగు ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే అద్భుతమైన సినిమా ఇది అని ఒక నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో గా నటించారని తెలియజేశారు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ కంటే సెకండాఫ్ చాలా హైలైట్ గా కొనసాగింది అని తెలిపారు.

ఇక ఈ సినిమా విజువల్ గ్రాఫిక్స్, మ్యూజిక్ ఈ సినిమాను మరొక స్థాయికి తీసుకువెళ్లాయని మరి కొంతమంది తెలియజేస్తున్నారు. ఇక నెటిజన్లే కాకుండా మరొకవైపు .. సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖుల సైతం ఈ సినిమాకు మద్దతుగా తెలియజేస్తున్నారు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ హీరో సాయి ధరంతేజ్, సత్యదేవ్, సంగీత దర్శకుడు తమన్ ట్వీట్స్ రూపంలో ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు.

Share post:

Popular