బింబిసారకు అదిరిపోయే కలెక్షన్లు.. మొదటి రోజు వసూళ్లు ఎంతంటే..!

నందమూరి కళ్యాణ్ రామ్ మొదటిసారిగా చేసిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. సంయుక్త మీనన్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించగా వశిష్ట దర్శకుడిగా పరిచయమయ్యాడు. టీజర్, ట్రైలర్ లతోనే మంచి బజ్ తెచ్చుకున్న బింబిసార సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 15కోట్లు చేయగా మొదటి రోజే ఈ సినిమా రూ.6.3 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది.Bimbisara first look: Nandamuri Kalyanram transforms into the barbarian  king, seated on a throne of corpses | Entertainment News,The Indian Express

భారీ అంచనాలున్న సీతారామం సినిమాతో పాటు విడుదలైన ఈ మూవీ మొదటి రోజే ఈ మాత్రం షేర్ తీసుకువస్తుందని నిర్మాతలు కూడా ఊహించలేదు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ కూడా కలసి రానుంది. ఇందుకు తగ్గట్టుగానే మేకర్స్ థియేటర్ల సంఖ్య కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది.Sita Ramam Movie (2022): Cast | Trailer | Songs | OTT | Release Date - News  Bugz

ఈ సినిమాతో పాటు విడుదలైన సీతారామంకు హిట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సీతారామం, బింబిసార సినిమాలకు ఇండస్ట్రీ నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సీతారమం, బింబిసార చిత్ర యూనిట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధ పడుతున్న ఇండస్ట్రీకి, ఊరట, ఉత్సాహాన్ని ఇస్తూ కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని సీతారమం, బింబిసార సినిమాలు నిరూపించాయని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. హీరో విజయ్ దేవరకొండ కూడా సీతారామం, బింబిసార యూనిట్లకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

Share post:

Latest