ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అంతేకాదు వివాహం జరిగి గర్భం దాల్చిన తర్వాత కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా.. యాక్షన్ సన్నివేషాలలో నటించి ఎంతోమంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. వర్కులో పూర్తి డెడికేషన్ తో పనిచేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఇటీవల ఈమె బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో తన భర్త రణబీర్ కపూర్ కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కకపోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తన భర్తతో కలిసి ఆలియా భట్ బేబీ బంప్ తోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఈమె విశ్రాంతి తీసుకోకుండా ఇలా ప్రమోషన్స్ కోసం అంటూ తిరుగుతూ ఉండడం చూసి అందరూ ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన బేబీ బంప్ తో దర్శనమిచ్చి.. పింక్ కలర్ డ్రెస్ మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్ కోట్ తో స్టైలిష్ గా కనిపించింది. గూచి బ్రాండ్ కు చెందిన ఈ డ్రెస్ లో ఆలియా చాలా బొద్దుగా కనిపిస్తోందని చెప్పవచ్చు.![Brahmastra star Alia Bhatt glows with joy as she hides her baby bump; Ranbir Kapoor plays the ideal protective pati [View Pics]](https://st1.bollywoodlife.com/wp-content/uploads/2022/08/Brahmastra_Couple_Ranbir_Kapoor_Alia_Bhatt_Promotion_Baby_Bump.jpg)
ఇదిలా ఉండగా ఆలియా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.
పింక్ కలర్ చిఫాన్ రసూల్ టాప్ ధర గూచీ అధికారిక వెబ్సైట్లో 4,100 డాలర్లుగా ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3,27,883 .. ఇక ఒక్క డ్రెస్ కు ఆలియా అంత ఖర్చు పెట్టడంతో నేటిజనుల సైతం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అంతలా ఈ డ్రెస్ లో ఏముంది అంటూ కూడా కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

