మతి పోగొడుతున్న హీరోయిన్ శ్రీలీల.. కుర్రాళ్ళు ఈ ఫోటోలు చూడొద్దు సుమా!

‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరపైకి అరంగేట్రం చేసిన హీరోయిన్ శ్రీలీల. సినిమా సంగతి అటుంచితే ఈ సినిమా చూసిన ప్రముఖుల మనస్సులో హీరోయిన్ శ్రీలీల తనదైన ముద్రను వేసుకుంది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. పెళ్లి సందD సినిమాలో తన అందచందాలతో కుర్రకారుని మెప్పించింది శ్రీలీల. అయితే శ్రీలీల కేవలం గ్లామర్ను మాత్రమే కాకుండా నటనతో ఆకట్టుకోవాలనీ చూస్తోంది. ప్రస్తుతం శ్రీలీల 7 సినిమాలకు సైన్ చేసిందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

అయితే ఆమెకు ఈరేంజ్‌లో వరుస అవకాశాలు రావడానికి ఆమె అందమే కాదు, ఓ వ్యక్తి కూడా కారణమట. ఆయన వల్లే తెలుగులో ఈ రేంజ్‌లో అవకాశాలు వస్తున్నాయని అంటోంది టాలీవుడ్. శ్రీలీలను లైమ్ లైట్‌లోకి తీసుకోచ్చింది.. దర్శకుడు రాఘవేంద్రరావు అని అందరికీ తెలిసిందే. ఆయన వల్లే తనకు ఈ రేంజ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయని తాజాగా ఓ మీడియా వేదికగా శ్రీలీల చెప్పడం గమనార్హం. తెలుగు సినీ రంగంలో తనకు మొదటి అవకాశం ఇచ్చి.. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు బుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది శ్రీలీల.

ఇకపోతే ఈ భామ ప్రస్తుతం రవితేజ వంటి సీనియర్ సినిమాలో హీరోయిన్ గా నటించడం కొసమెరుపు. అలాగే బాలయ్య, మహేష్ బాబు, శర్వానంద్, నితిన్‌ సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ అందాల భామ. అంతేకాకుండా కుర్ర హీరోలు సైతం ఆమెనే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. దాంతో రాబోయే రోజుల్లో అమ్మడు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా మారబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే అమ్మడు ఫోటో షూట్స్ లో కూడా ఇరగదీస్తోంది. తాజాగా ఓ ఫోటో షూట్లో పాల్గొని కుర్రకారుని చిత్తుచేసింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest