వామ్మో.. ఒక్కో ఎపిసోడ్ కు కాజోల్ పారితోషికం అన్ని కోట్లా..?

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కేవలం ఒక్క సినిమాలోనైనా నటించే అవకాశం వస్తే చాలు అని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అలా ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ పొజిషన్ లో కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా ఒకరు. అయితే ఈమె వయసు మీద పడుతున్న కొద్దీ కూడా ప్రేక్షకులను అలరిస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నది. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.Bollywood Actress Kajol Tests Positive for COVID-19

మొదట బాలీవుడ్లోకి దిల్ వాలే దుల్హానా లేజాయాంగే సినిమా ద్వారా మొదటిసారి సౌత్ ఇండియా , నార్త్ ఇండియా అని తేడా లేకుండా అన్ని భాషలలో నటించింది హీరోయిన్ కాజోల్. ఇక ఒకప్పుడు బాలీవుడ్లో ఉన్నటువంటి అందరి హీరోలతో కూడా నటించింది. ఈ క్రమంలోని వివాహమైన తర్వాత కొంతకాలం పాటు సినిమాలలో కొనసాగించినా.. ఇక తల్లి అయిన తర్వాత మాత్రం నటనకి బ్రేక్ ఇచ్చి కేవలం తన కుటుంబ బాధ్యతలను మాత్రమే చూసుకుంటూ అలాగే తన భర్త అజయ్ దేవగన్ స్థాపించిన పలు వ్యాపార సంస్థలను చూసుకుంటూ ఉండేది.Kajol And Ajay Devgn To Be Separated Because Of Their Kids, Nysa And Yug?  Detailed Report

అయితే తాజాగా ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి కాజోల్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలలో నటిస్తూ ఉండగానే మరొకపక్క కొన్ని రియాల్టీ గేమ్ షోలలో నటిస్తూ ఉన్నట్లు సమాచారం. అయితే తాజాగా నటి కాజోల్ ప్రముఖ ఓటీటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో ఒక రియాల్టీ షో గేమ్ కి హోస్టుగా వ్యవహరించేందుకు ఒప్పందం తీసుకున్నట్లుగా సమాచారం. ఇందులో ఒక్కో ఎపిసోడ్ కి ఈమె రూ.5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నటి కాజోల్ అన్ని కోట్ల రూపాయలను అందుకుంటూ వార్తలలో నిలుస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ వార్తలలో ఎలాంటి నిజం ఉందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest