ఓ మై గాడ్: కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..సమంత మరో చెత్త పని..?

సమంత..ఈ అందాల కుందనపు బొమ్మ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లను తన అందంతో, నటనతో మాయ చేసి పడేసింది. అంతేనా, ఏకంగా అక్కినేని ఇంటికి కూడా కోడలు అయ్యి..ప్రత్యేకమైన అటెన్షన్ ని కొట్టేసింది. ఓ వైపు స్టార్ హీరోయిన్, మరో వైపు అక్కినేని ఇంటి పెద్ద కోడలు..అబ్బో, అమ్మడి జాతకం బాగుందే అని అందరు అనుకుంటున్న టైంకి..భర్తకి విడాకులు ఇచ్చేసింది. ఒక్క నోట్..” మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ..” చెప్పేసి..చేతులు దులిపేసుకున్నారు ఇద్దరు.

ఆ తరువాత ఆయన పాటికి ఆయన సినిమాలు , వెబ్ సిరీస్ లు..కొత్త బిజినెస్లు నడుపుకుంటూ బిజీ గా మారిపోయారు. ఇక సమంత ఏమన్నా తక్కువ..ఇప్పుడు చూడు నా పర్ ఫామెన్స్ లు అంటూ..ఏకంగా పాన్ ఇండియా మూవీ లో..”ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా”..అంటూ ఎద అందాలను..ధైస్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ..కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఈ పాట సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ పాట ఇప్పటికి ట్రెండ్ అవుతుంది. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఇదే పాట..అదే ఊపు..ఒక్క పాటతో మళ్ళీ తన క్రేజ్ ని సంపాదించుకుంది సమంత.

కాగా, ఇప్పుడు మళ్ళీ ఇదే తరహాలో ఓ మాస్ పాట కి చించులు వేయబోతుందట ఈ అందాల ముద్దుగుమ్మ. సమంత కెరీర్ లోనే ఫస్ట్ టైం హీరోయిన్ గా పాన్ ఇండియా లెవల్ లో రాబోతున్న సినిమా యశోద . ఈ సినిమా లో ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైందని ఇటీవలే చిత యూనిట్‌ తెలిపింది. ఆ పాటే ఈ సమంత మాస్ మసాలా పాట. ప్రస్తుతం ఈ పాటను సమంతపై చిత్రీకరిస్తున్నారట చిత్ర బృందం.

 

హైదారబాద్ లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారట. మణిశర్మ అందించిన మాస్ బీట్ సాంగ్ కు సమంత వేసే హాట్ మసాల స్టెప్పులు హైలెట్ కానున్నాయి అంటున్నారు మేకర్స్. అయితే, ఒక్క పాట కే సమంతని బూతులు తిట్టిన అక్కినేని అభిమానులు..ఇప్పుడు మరోసారి సమంత రెచ్చిపోయి ఊపేస్తుంది అంటే ఊరుకుంటారా..సమంతని ఏకిపారేయడానికి రెడీ గా ఉన్నారు. కొందరైతే చెత్త పనులు చేయకు సమంత అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు..మరి చూడాలి సమంత మాస్ సాంగ్ ఎలా ఊపేయనుందో..?

Share post:

Latest