తల్లిదండ్రులను ఎదిరించి మరీ వివాహం చేసుకున్న సౌందర్య..చివరికి..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అచ్చ తెలుగు అమ్మాయిగా సహజ నటిగా గుర్తింపు పొందింది అలనాటి హీరోయిన్ సౌందర్య. గతంలో అగ్ర హీరోల సరసన అందరితో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక ఏ పాత్రలోనైనా సరే ఎంతో ఒదిగిపోయి నటించేది సౌందర్య. వాస్తవానికి ఏమేమి కన్నడ పరిశ్రమ అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ టాలీవుడ్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ ఈమె చిత్రాలు బుల్లితెరపై అలరిస్తూనే ఉంటాయి. కానీ 2004వ సంవత్సరంలో దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించింది.సౌందర్య చనిపోయాక ఆమె భర్త పరిస్థితి ఎలా మారిందో చూడండి..!

అయితే అప్పటికే సౌందర్యకు వివాహం అయ్యింది. అయితే సౌందర్య భర్త గురించి చాలామందికి పలు విషయాలు తెలియవు సౌందర్యకి దగ్గర బంధువైన ఇతని పేరు జిఎస్ రఘు. ఇతడిని వివాహం చేసుకోవడానికి సౌందర్య తల్లిదండ్రులకు అసలు ఇష్టం లేదు కానీ… కానీ తల్లిదండ్రుల మాట కాదని రఘు అని వివాహం చేసుకున్నది సౌందర్య. 2003 వ సంవత్సరంలో వీరిద్దరి వివాహం చేసుకున్నారు. ఇక సౌందర్య భర్త రఘు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కొన్నాళ్లు వీరిద్దరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగించేవారు. అయితే సౌందర్యం మరణించిన తర్వాత కొంతకాలానికి అపూర్వ అని ఒక అమ్మాయిని మరొక వివాహం చేసుకున్నారు రఘు.

ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి గోవా లో స్థిరపడ్డారని సమాచారం. ఇక సౌందర్య ఆస్తి కొన్ని వందల కోట్లు ఉండడంతో ఆ ఆస్తిని మొత్తం తన పేరు మీద రాయించుకొని సౌందర్య తల్లిదండ్రులకు వాటా కూడా ఇవ్వలేదని సౌందర్య తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉన్నది. ఇక అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన సౌందర్య ఏ ఒక్కరితో కూడా ఎఫైర్ నడిపినట్లుగా వార్తలు వినిపించలేదు. కానీ అతి తక్కువ కాలంలోనే సౌందర్యం మరణించడంతో ప్రతి ఒక్కరిని బాధించిందని చెప్పవచ్చు.

Share post:

Latest