ఆ పాత్ర నచ్చకపోయినా మహేష్ సినిమాలో నటించాను అంటున్న ప్రకాష్ రాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. తాను నటించే ఏ పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తారని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా తను చేయని పాత్ర అంటూ ఏది లేదని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే కొన్ని సినిమాలలో పాత్రలు నచ్చకపోయినా సరే చేశా అంటున్నారు ఈయన. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.Sarileru Neekevvaru' review: Mahesh Babu's outing as army man is a treat  for fans | The News Minute

ప్రకాష్ రాజ్ ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రకాష్ రాజ్ తనకు పాత్ర నచ్చకపోయినా సరే మొహమాటానికో లేక డబ్బులకో కొన్ని సినిమాలు చేశానని తెలిపారు. అలాంటి వాటిలో మహేష్ తో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఒకటని తెలిపారు. నటుడుగా తను ఎంచుకున్న పాత్రలు ఎలా నటించాలి అన్న ఆసక్తి కలగాలని రొటీన్ పాత్రలు చేసి తనకు బోర్ కొట్టేసిందని తెలిపారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో తను చేసిన పాత్ర తనకు నచ్చకపోయినా చేయవలసి వచ్చింది అని తెలిపారు.060120124815mahessh.jpgఅంతేకాకుండా కొన్నిసార్లు అలా నచ్చకపోయినా సరే సినిమాలలో నటించాల్సి ఉంటుంది అని కామెంట్ చేశారు. అయితే మనసుకు నచ్చిన పాత్ర రెమ్యూన రేషన్ తగ్గినా కూడా తాను చేస్తానని తెలిపారు.. అలాంటి ఛాలెంజ్ రోల్స్ కోసం తాను కొంత వరకు కూడా వెయిట్ చేస్తున్నానని తెలిపారు. కమర్షియల్ గా ఉండే రొటీన్ పాత్రలకు మాత్రం రెమ్యునరేషన్ తగ్గించనని తెలిపారు. ఇక ఈ మధ్యకాలంలో నటించిన మేజర్ సినిమా తనకు బాగా నచ్చింది అని అలాంటి పాత్రలు చేస్తున్నప్పుడు మనసు చాలా ఆనందంగా ఉంటుంది అని తెలిపారు. సరిలేరు నీకెవరు చిత్రంలో తనకు పాత్ర నచ్చలేదని చెప్పి మహేష్ అభిమానులను హర్ట్ అయ్యేలా చేశారు. దీంతో అభిమానుల సైతం నచ్చకపోతే సినిమాలో నటించకుండా ఉండాల్సింది రెమ్యూనరేషన్ తీసుకొని నటించి సినిమా నచ్చలేదు అంటే ఎలా అని కామెంట్ రూపంలో తెలుపుతున్నారు.