అన్నీ మా హీరోకే జరగాలా అంటోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా సినిమా తీసి దాదాపు మూడేళ్లకు పైగా అయ్యింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించడంతో ఎక్కువ క్రెడిట్ ను తారక్ కొట్టేయలేకపోయాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తారక్ నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ తన పుట్టినరోజున తాను చేయబోయే రెండు ప్రాజెక్టులను అఫీషియల్ గా అనౌన్స్ చేసి అభిమానులను సంతృప్తి పరిచాడు. అయితే ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుండటంతో, మళ్లీ తారక్ ఫ్యాన్స్ ఆకలిమీద ఉన్నారు.

తమ అభిమాన హీరో నెక్ట్స్ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. కానీ స్క్రిప్టులో మార్పులు చేర్పులు వంటి అంశాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఆగస్టు 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. కానీ, ఇప్పుడు మరో అంశం ఈ సినిమా షూటింగ్ కు అడ్డుగా మారింది. ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్స్ బంద్ నిర్ణయాన్ని వెల్లడించడంతో ఈ ఎఫెక్ట్ పలు భారీ సినిమాలపై పడనుంది.

ఇందులో తారక్-కొరటాల మూవీ కూడా ఒకటి. తమ హీరో సినిమాకే ఎందుకిలా జరుగుతోందని తారక్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. నిర్మాతల సమస్యలను త్వరగా పరిష్కరించుకుని, సినిమా షూటింగ్స్ మొదలైతే, తారక్ కొత్త సినిమా పట్టాలెక్కుతుందని వారు ఆశిస్తున్నారు. మరి ఆగస్టులోనైనా తారక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.