ఇప్పట్లో ఆ పని చేయనంటోన్న నిత్యా

అందాల భామ నిత్యా మీనన్ ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ బ్యూటీకి సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ సినిమాలు తక్కువ చేయడానికి ఓ బలమైన రీజన్ ఉందని.. త్వరలోనే అమ్మడు పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఈ వార్తలపై నిత్యా మీనన్ కూడా సైలెంట్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. త్వరలోనే ఈ బ్యూటీ నిజంగానే పెళ్లిపీటలు ఎక్కుతుందని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ బ్యూటీ ఎవరిని పెళ్లాడబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పట్లో ఆ పని జరిగేది కాదని.. తన పెళ్లికి ఇంకా సమయం పడుతుందని.. అయినా తనకు లేని ఆతృత మిగతావారికి ఎందుకంటూ అమ్మడు గట్టిగానే ఏసుకుంది.

తన పెళ్లి గురించి సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని.. మీడియాకు ఎందుకంత ఆతృత అంటూ నిత్యా గట్టిగానే ఏసుకుంటోంది. అయితే అమ్మడు ఎవరితోనో డేటింగ్ లో ఉన్నట్లుగా గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నా, వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తోంది. మరి నిజంగానే నిత్యా మీనన్ ఎవరితోనైనా ఎఫైర్ లో ఉందా.. లేక నిజంగానే పెళ్లి గురించి సమయం వచ్చినప్పుడే చెబుతానంటోంది ఈ బ్యూటీ. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ బొద్దు గుమ్మ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూనే, పలు టీవీ షోల్లోనూ మెరుస్తూ తన అభిమానులను అలరిస్తోంది.