నయా ట్రెండ్: న్యూడ్ ఫోటోలతో మరో స్టార్ హీరో.. ఫోటోగ్రాఫర్ గా మారిన భార్య..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కి తెరలేపుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోస్.. సినిమాలలో మాత్రమే న్యూడ్ ఫొటో షూట్ లతో రెచ్చిపోయిన ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఏకంగా న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వదిలి మరింత రచ్చ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ , విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా సినిమా పోస్టర్ల కోసం న్యూడ్ ఫోటోలు వదిలిన విషయం తెలిసిందే. కానీ నిన్నటికి నిన్న బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మ్యాగజైన్ పై కవర్ పేజీ కోసం చేసినా.. ఇక వీటిని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడమే కాకుండా పలు రకాల వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి.vishnu vishal, బెడ్‌పై నగ్నంగా విష్ణు విశాల్.. భర్త ఫోటోను క్లిక్ చేసిన గుత్తాజ్వాల.. ఛీ బాబోయ్ - kollywood hero vishnu vishal nude photo and his wife gutta jwala turns photographer ...

ఇదిలా తాజాగా మరో స్టార్ హీరో న్యూడ్ ఫోటోలను నెట్టింట వదిలి సంచలనం సృష్టించాడు. ఇక రణవీర్ సింగ్ చేసిన పని మరువకముందే మరో హీరో సెమి న్యూడ్ ఫోటో షూట్ తో ముందుకు రావడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇక ఆయన ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విష్ణు విశాల్. రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమాలో చిన్న పాత్ర చేసిన విష్ణు విశాల్.. ఎఫ్ఐఆర్ సినిమాతో సోలో హీరోగా తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆయన తెలుగమ్మాయి గుత్తా జ్వాలను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.Jwala Gutta Helps Hubby Vishnu Pull A Ranveer-Like Photoshoot

ఇక ఈ క్రమంలోనే ఇతడు సోషల్ మీడియాలో కొన్ని సెమి న్యూడ్ ఫోటోలను చేశారు. నడుము కింది వరకు కనిపించేలా కేవలం దుప్పటి మాత్రమే అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు. అంతేకాదు ఫోటోలను షేర్ చేస్తూ” ట్రెండ్ లో జాయిన్ అవుతున్నా” అంటూనే “తన భార్య ఫోటోగ్రాఫర్ గా మారిందని” కింద క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నయా ట్రెండ్ లో ఇంకా ఎంతమంది స్టార్ హీరోలు చేరుతారో తెలియాల్సి ఉంది.