జాతీయ అవార్డు వచ్చిన సూర్య..కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేశాడనే విషయం మీకు తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలోను మంచి మార్కెట్ ఫాం చేసుకున్నాడు. తనదైన స్టైల్ లో నటించి మెప్పించి కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ సింగం ఈ హీరో. సూర్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటేనే జనాల్లో అదో తెలియని క్రేజ్. యాక్షన్ సీన్స్ లో అయితే సూర్య నటన గురించి ఇంక చెప్పనవసరం లేదు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు సూర్య. ఈ మధ్య కాలంలో సూర్య అన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే చూస్ చేసుకుంటున్నాడు.

ఆకాశమే నీ హద్దురా, జై భీమ్..ఇలా సమాజానికి ఉపయోగపడే సినిమా కధలను చూస్ చేసుకుంటూ..సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. నిన్న అనౌన్స్ చేసిన జాతీయ అవార్డ్స్ లో సూర్య సూపర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఎందుకంటే ఆయన నటించిన సూరారై పోట్రు సినిమా ఏకంగా ఐదు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా సూర్య కూడా నేషనల్ అవార్డ్ సాధించారు. దీంతో ఆయనకు స్టార్స్ నుండి శుభాకాంక్షల వెల్లువ మొదలైయ్యింది. బడా బడా బిగ్ స్టార్స్ అందరు..సూర్య కి కంగ్రాట్స్ చెప్పుతున్నారు. నువ్వు ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నారు.

అయితే, ఇలా జనాల చేత పొగిడించుకుంటున్న సూర్య..కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్ గా నిలిచిన ఈ జంట..ప్రేమ కోసం నానాతిప్పలు పడ్డారట. వీళ్లు కలిసి సినిమా చేస్తున్న టైంలోనే ఒకరినిఒకరు ఇష్టపడ్డారు.

కానీ, వాళ్ల ప్రేమ మ్యాటర్ ఇంట్లో చెప్పితే ఒప్పుకోరు అని తెలిసి..ఎవ్వరికి తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారట. ఆ తరువాత కొన్నాళ్లకు మ్యాటర్ బయటపడింది. ఆ టైంలో సూర్య, జ్యోతికలు చాలా ఇబ్బందిపడ్డారట. ఇంట్లో వాళ్ళు బూతులు తిట్టారట. కానీ, పెళ్లి చేసుకున్నాక మనం ఏం చేయలేం అని..నలుగురిలో పరువు కాపాడుకోవడానికి మళ్ళీ ఘనంగా అఫిషీయల్ గా పెళ్ళి చేశారట. సినీ కెరీర్ పరంగా సూర్య ఎంత ఎత్తుకి ఎదిగినా..ఈ బాధ ఎప్పుడు మనసులోనే ఉంటుందట.

 

 

 

Share post:

Latest