బావబావమరిదిగా మారుతున్న నందమూరి-మెగా హీరోలు..!!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ సుప్రీమ్ సినిమాతో మంచి పేరు సంపాదించారు. ఇక తను నటించిన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా సాయి ధరం తేజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వినోదమం సీత్తం చిత్రాన్ని డైరెక్టర్ సముద్ర ఖని తెరకెక్కించబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సాయి ధరంతేజ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం.Jr NTR Wishes Speedy Recovery To Dharam Tej - India Ahead

ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. కాకపోతే రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా రీమిక్స్ చేయడానికి ఒప్పుకున్నారు. అయితే పవన్ మాత్రం ఈ సినిమాకి సరిగ్గా డేట్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా కోసమే సాయి ధరంతేజ్ మరొక సినిమాను కూడా మొదలుపెట్టలేదు. అయితే పవన్ కళ్యాణ్ డేట్లు కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం కావడంతో సాయి ధరంతేజ్ సోలోగా మరొక సినిమాలో గెస్ట్ రోల్ పాత్రను చేయడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సాయి ధరంతేజ్ నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ , సాయి ధరమ్ తేజ్ బావ బామ్మర్దుల క్యారెక్టర్ లలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న హీరోయిన్ పాత్రకు కీలకమైన పాత్ర ఉన్నది. ఇందులో ఆమెను ప్రేమించే పాత్రలో సాయి ధరంతేజ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇక వీరి ప్రేమ గురించి సినిమా స్టోరీ అంత ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం. మరి నిజంగానే సాయి ధరంతేజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాకు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ నిర్ణయించినట్లు సమాచారం.

Share post:

Latest