ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడితో ఇలియానా ప్రేమాయణం..!!

ఇలియానా.. నడుము ఒంపు సొంపులతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ అందచందాలతో ఎంతోమంది కుర్ర కారును ఉర్రూతలూగించింది. ఇక తన నటనతో, చలాకీతనంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఇలియానా ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఉన్నట్టుండి బరువు పెరిగి మళ్ళీ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈమె ఆ తర్వాత శ్రమించి మరీ తన ఫిజిక్ ను తిరిగి తెచ్చుకుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న ఇలియానా ఇప్పుడు మరొకసారి ప్రేమలో పడిందనే టాక్ బాగా వైరల్ గా మారుతుంది. మొన్నటి వరకు ఒక విదేశీయుడుతో ప్రేమ కథను నడిపిన ఈ ముద్దుగుమ్మ .. అతడితో చాలాకాలం సహజీవనమే చేసిందని సమాచారం.iliana singed a movie with ajay dewgan and rejected diljit dosanjh movie | अजय देवगन की खातिर इलियाना ने छोड़ा दिलजीत दोसांझ का साथ | Hindi News, बॉलीवुड

అంతేకాదు వీరి సహజీవనం హద్దులు దాటి, ఆమె ప్రెగ్నెంట్ అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇక తర్వాత నిశ్చితార్థం కూడా జరిగిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అనే వార్తలు కూడా బాగా వినిపించాయి. ఈ వార్తలు రాకముందు ఈమె తెలుగు సినిమా హీరోతో ప్రేమలో పడినట్టు కూడా తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక ఆ ప్రేమ ప్రకటన వెంటనే అతనితో బ్రేకప్ చెప్పుకున్న ఈమె సినిమాలకు కూడా దూరం కావాల్సి వచ్చింది. నిజానికి ఇలియానా ఖాతాలో ప్రేమ కథలకు లోటు లేదు అని చెప్పడంలో సందేహం లేదు.ఇక తాను ఎంతగానో ప్రేమించిన ప్రియుడితో కూడా బ్రేకప్ చెప్పుకొని.. ఈమె బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ అక్కడున్న వ్యక్తులతో పరిచయాలు కూడా బాగానే ఏర్పరచుకున్నట్లు సమాచారం.హీరోయిన్ సోద‌రుడితో ఇలియానా తాజా ప్రేమ‌క‌థ‌!

ఈ నేపథ్యంలోనే ఈమె మరొకసారి ప్రేమలో పడిందని వార్త బాగా వైరల్ అవుతుంది. ఇక అతడు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్ సోదరుడు. కత్రినా కైఫ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆమె సోదరీ, సోదరుడు కూడా తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఈమె సోదరి ఇసాబెల్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని వార్త వచ్చిన ఆ తర్వాత ఆమె జాడే లేదు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు . ఇక ప్రస్తుతం ఇతడితోనే ఇలియానా డేటింగ్ చేస్తోందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో వీరంతా కలసి ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక ఈ సాన్నిహిత్యం వెనుక ఇలియానా సెబాస్టీయన్ ప్రేమ కథ నడుస్తోందని బీ టౌన్ లో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.