కృతిశెట్టికి నిద్రపోయే ముందు ఆ వీడియోలు చూసే అలవాటు ఉందా..?

అదృష్టం ఎప్పుడు ఎలా ఎవ్వరిని వరిస్తుందో ఎవ్వరు చెప్పలేం. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ కన్నడ బ్యూటీ కృతిశెట్టి. బుద్ధిగా చదువుకుంటూ ..ఫ్రెండ్స్ తో జాలీగా గడుపుతున్న కృతికి యాడ్స్ లో అవకాశాలు రావడం..అలా అమ్మడు అందాలకి డైరెక్టర్లు ఫిదా కావడం..తద్వారా, మెగామేనల్లుడు ఉప్పెన సినిమాలో ఛాన్స్ రావడం..చకచకా జరిగిపోయాయి. కళ్ళు మూసి తెరిచే లోపే కృతి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు..ఇలా బడా సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది.

అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్రేజీయస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసిన ఈ అమ్మడు మరో రెండు ప్రాజెక్టలను హోల్డ్ లో పెట్టిన్నట్లు తెలుస్తుంది. తెలుగులో అయితే, ఏకంగా నాలుగు సినిమాలకు కమిట్ అయిపోయింది. ఈ లెక్కన చూసుకున్న మరో మూడేళ్ళు కృతి కెరీర్ కి ఏ ఢోకా లేదు. ప్రజెంట్ లింగుస్వామీ డైరెక్షన్ లో రామ్ హీరో గా నటిస్తున్న..”ది వారియర్ మూవీ”లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా.. ఓ క్రేజీ న్యూస్ ఆమెకు సంబంధించింది నెట్టింట వైరల్ గా మారింది. కృతిశెట్టి ఏజ్ చాలా చిన్నది. చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పైగా కృతి కి తల్లి గారాభం కూడా ఎక్కువేనట. ఇంట్లో ఇప్పటికి చిన్న పిల్ల లా అల్లరి చేస్తుందట. ఆశ్చర్యం ఏమిటంటే కృతి ఇప్పటికి బొమ్మలతో ఆదుకుంటుందట. కార్ట్యూన్స్ అంటే చాలా ఇష్టమట. ఎంత ఇష్టమంటే..నిద్రపోయే ముందు ఖచ్చింతా కనీసం పదినిమిషాలు అయినా..అలా కార్ట్యూన్స్ చూసే నిద్రపోతుందట. అంత పిచ్చట కృతి కార్ట్యూన్స్ అంటే. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Latest