కమిట్మెంట్ ట్రైలర్ రిలీజ్.. ఇంత బూతు వెనుక భగవద్గీత.. దానికోసమేనా..?

ఈమధ్య కాలంలో రహస్యం అనే పదానికి ఎక్కడ చోటు లేకుండా పోయింది . ఇక అన్నీ కూడా బహిరంగంగానే బయట చెప్పేస్తూ ఏ విషయాన్ని కూడా దాచలేనంతగా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా అన్నీ బూతు పురాణాలలో కూడిన కమిట్మెంట్ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ నెట్టింట సంచలనం రేపుతోంది.. నిజానికి తెలుగమ్మాయి తేజస్వి మదివాడ చాలా పద్ధతిగా మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో అరంగేట్రం చేసింది . ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా అవతారం ఎత్తింది.Commitment Telugu Movie Official Trailer || Tejaswi Madiwada || Anveshi  Jain || NS - YouTube

ఐస్ క్రీమ్ సినిమా రాంగోపాల్ వర్మ సినిమా కావడంతో ఈ ముద్దుగుమ్మ పై సహజంగానే బోల్డ్ అంటూ ముద్ర పడిపోయింది . ఇక ఆ క్రమంలోనే అప్పటినుంచి ఆమెకు అటువంటి పాత్రలే వస్తూ ఉండడంతో కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ కమిట్మెంట్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏదైనా ఒక పాత్ర ద్వారా బాగా ఫేమస్ అయితే అవే పాత్రలు వారిను వెతుక్కుంటూ వస్తాయనిలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే తేజస్వి తీసుకున్న ఒక రాంగ్ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఈమె అన్నీ కూడా ఇలాంటి బోల్డ్ పాత్రలో నటించడానికి అవకాశాలు వస్తూ ఉండడం గమనార్హం.

ఇక ఈ క్రమంలోనే తేజస్వీ మదివాడ, అన్వేషి జైన్, తనిష్కరాజన్, సీమర్ సింగ్ లాంటి హాట్ బోల్డ్ బ్యూటీలతో తెరకెక్కించిన కమిట్మెంట్ సినిమా టీజర్ 2యేళ్ళ క్రితమే విడుదలయ్యింది. కానీ అప్పుడే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఈ రెండేళ్లలో ఈ సినిమా గురించి ఎటువంటి వార్త రాకపోవడం గమనార్హం. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను మళ్ళీ వదిలారు. ఈ ట్రైలర్ చూస్తే బోల్డ్ సీన్స్ లతో ఈ హాట్ బ్యూటీలు రెచ్చిపోయారని చెప్పవచ్చు. అయితే చివరలో బోల్డ్ సీన్లు వెనుక భగవద్గీత బ్యాగ్రౌండ్ కాంట్రవర్సీకి దారి తీసింది అని చెప్పవచ్చు. ఇకపోతే పబ్లిసిటీ కోసమే ఇలాంటి చేశారంతూ నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.