అఖిల్ కెరీర్ ఒడిదుడుకుల‌కు అమ‌లే కార‌ణ‌మా… సంచ‌ల‌న నిజాలు…!

అక్కినేని కోడలిగా.. నాగార్జున రెండవ భార్యగా అమల ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈమె కేవలం అక్కినేని కోడలుగా మాత్రమే కాకుండా పలు సేవా సంస్థలను నడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది అంతేకాదు అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను కూడా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అవుతోంది. ఇదిలా ఉండగా ఈమె కొడుకు అఖిల్ చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే అఖిల్ తెలివికి ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా స్టార్ హీరో అవుతారని అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలను అఖిల్ ఒక్కసారిగా తారుమారు చేశారని చెప్పవచ్చు.Everyone Should Lookout For ZEE5 Original Loser, Says High Priestess Actor  Amala Akkineni - Zee5 News

ముఖ్యంగా అఖిల్ మొదటిసారి అఖిల్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. కానీ మొదటి సినిమాతోనే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సినీ ఇండస్ట్రీకి కొన్ని సంవత్సరాల పాటు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటివరకు ఏమీ రాకపోవడంతో ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి.Agent: Nagarjuna Akkineni and Amala launch Akhil Akkineni starrer with a  puja ceremony; SEE PHOTOS | PINKVILLAఇకపోతే తన సినీ కెరీర్ లో ఫెయిల్ అయినట్టుగానే వ్యక్తిగత జీవితంలో కూడా ఫెయిల్ అయ్యారని అందరికీ తెలిసిందే. నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత కూడా వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అలా వైవాహిక జీవితంలో ఆయన సంతోషంగా లేకపోవడమే కాదు సినీ జీవితంలో కూడా సంతోషంగా లేరని చెప్పాలి. అయితే వీటన్నిటికీ కారణం అఖిల్ తల్లి అమల అని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు తెలియజేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు నీచ స్థానంలో ఉండడం కారణంగా అక్కినేని కుటుంబాలకు వ్యక్తిగతంగానే కాకుండా సినీ పరంగా కూడా పెద్దగా కలిసి రావట్లేదు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అఖిల్ కెరియర్ విషయంలో అమల జోక్యం చేసుకోవడం మానేస్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తాడు అంటూ కూడా వేణు స్వామి చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Share post:

Latest