పార్వతి మెల్టన్ ను దారుణంగా వాడుకుని వదిలేసిన బడా హీరో – డైరెక్టర్ ?

సినిమా ఇండస్ట్రీ ఎంత ఆకర్షణీయం అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పాత హీరోయిన్ ల కన్నా కూడా కొత్త హీరోయిన్ లు ఎక్కువగా పరిచయం అవుతున్నారు. కానీ ప్రతిభ ఉంటేనే మళ్లీ అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. కానీ కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకు సరిపెట్టుకుని వెనుతిరుగుతున్నారు. కానీ కొందరు మాత్రం సినీ పెద్దల మాయ మాటలకు పడిపోయి మోసపోతున్నారు. అలాంటి వారిలో ఒకరే ప్రముఖ నటి పార్వతి మెల్టన్. ఈమె చూడడానికి అచ్చం మన తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది. ఈమె కెరీర్ ‘వెన్నెల’ అనే సినిమాతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా మరియు ప్రత్యేక పాత్రలు చేసి అలరించింది. కానీ ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకోలేక అవకాశాలు రాక ఖాళీగా ఉంటోంది. అలా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే ఈమె చివరగా నటించిన చిత్రం శ్రీమన్నారాయణ.

అయితే ఈమె గురించి గత కొంత కాలంగా కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి పార్వతి మెల్టన్ చెప్పుకుని చాలా బాధపడింది. మామూలుగా పార్వతి మెల్టన్ మన దేశానికి చెందిన అమ్మాయి కాకపోవడం గమనార్హం. వాస్తవంగా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈమె అమెరికాకు చెందిన వ్యక్తి. అయితే ఈమెను చూసిన మన తెలుగు బడా హీరో మరియు డైరెక్టర్ కలిసి తనకు సినిమా పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇండియాకు తీసుకు వచ్చారు. కానీ అలా వారిద్దరినీ నమ్ముకుని ఇండియాకు వచ్చిన పార్వతి మెల్టన్ ను ఆ తర్వాత ఎటువంటి అవకాశం ఇవ్వకుండా గాలికి వదిలేశారు అని చెప్పుకుని వాపోయింది. అయితే ఈ సినిమా అవకాశం కోసం తనను వాడుకున్నారని… అయితే తన శరీరమే కావాలంటే…అమెరికాలోనే ఇచ్చేదాన్ని ..కానీ ఇలా వారి స్వార్థానికి ఇక్కడకు తీసుకు వచ్చి నన్ను అన్యాయం చేశారు అంటూ బాధపడింది.

కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నన్ను ఆ ఇద్దరూ ఇబ్బంది పెట్టారని తన గోడు చెప్పుకుంది. అయితే పార్వతి మెల్టన్ అమెరికా నుండి వారు చెప్పిన మాయ మాటలు విని రాకుండా ఉంటే… ఈ పాటికి నేను అమెరికాలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ బాగా సంపాదిస్తూ ఉండే దాన్ని అంటూ తన గతాన్ని గురించి బాధపడుతూ వివరించింది. కాగా పార్వతికి ఇప్పటికే పెళ్లి అయ్యి సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఒక ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు పార్వతి మెల్టన్ ఇంత అందంగా ఉంటే… ఇలాగే అన్యాయాలు జరుగుతాయని ఆమెకు చెబుతున్నారు. అయితే తన జీవితం ఇలా అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం అయిన టాలీవుడ్ హీరో మరియు డైరెక్టర్ పేర్లు మాత్రం బయటకు రాకపోవడం గమనార్హం.

Share post:

Popular